దలైలామాకు గ్రామీ

Published on Tue, 02/03/2026 - 04:54

లాస్‌ఏంజెలెస్‌: టిబెటన్‌ల అ త్యున్నత ఆధ్యాత్మిక నేత దలై లామాకు అత్యంత ప్రతిష్టా త్మకమైన గ్రామీ సంగీత పుర స్కారం లభించింది. ఆయన ఆడియో ఆల్బం ‘మెడిటేషన్స్‌: ద రిఫ్లెక్షన్స్‌ ఆఫ్‌ హిజ్‌ హోలీనెస్‌ ద దలైలామా’కు ఈ గౌరవం దక్కింది. ఆడియో బుక్స్, నరేషన్‌ అండ్‌ స్టోరీ టెల్లింగ్‌ విభాగంలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. కేథీ గేర్వర్, ట్రెవర్‌ నోవా, కెటాంజీ బ్రౌన్‌ జాక్సన్, ఫాబ్‌ మోర్వన్‌ తదితరులతో పోటీపడి మరీ దలైలామా గ్రామీ నెగ్గడం విశేషం. ఆదివారం రాత్రి లాస్‌ఏంజెలెస్‌లో జరిగిన 68వ గ్రామీ వేడుకల్లో ఆయన తరఫున గాయకుడు రఫుస్‌ వెయిన్‌రైట్‌ అవార్డును స్వీకరించారు. 

కబీర్‌ సెహగల్‌ నిర్మాణంలో రూపొందిన దలైలామా ‘మెడిటేషన్స్‌’ ఆడియో ఆల్బంకు ప్రఖ్యాత సరోద్‌ నిపుణుడు ఉస్తాద్‌ అమ్జాద్‌ అలీ ఖాన్‌ సంగీతం అందించారు. ఆయన కుమారులు అమాన్‌ అలీ బంగాష్, అయాన్‌ అలీఖాన్, అమెరికా శాక్సోఫోనిస్ట్‌ టాడ్‌ నాష్, గాయక–రచయిత దేబీ నోవా తదితరులు కూడా ఆల్బం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. 90 ఏళ్ల వయసులో తొలిసారిగా గ్రామీ అవార్డు దక్కించుకుని దలైలా మా రికార్డు సృష్టించడం విశేషం. దాంతో దలైలామా నివాసముంటున్న హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన శిష్యులు, అనుయా యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా మాత్రం దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించింది.

మనోళ్లకు దక్కని గౌరవం
దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కె–పాప్‌ బృందం కూడా ఈసారి తొలిసారిగా గ్రామీ పురస్కారం దక్కించుకుంది. వారి యానిమేటెడ్‌ మ్యూజికల్‌ యాక్షన్‌ మూవీ ‘కే పాప్‌ డెమన్‌ హంటర్స్‌’ ఆల్బంలో పాపులర్‌ గీతం ‘గోల్డెన్‌’ను గ్రామీ వరించింది. అలాగే ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ కూడా తొలిసారి గ్రామీ పురస్కారం దక్కించుకున్నారు. ఆయన రూపొందించిన మ్యూజిక్‌ ఫర్‌ జాన్‌ విలియమ్స్‌’ డాక్యుమెంటరీకి మ్యూజిక్‌ ఫిల్మ్‌ విభాగంలో అవార్డు దక్కింది. దాంతో ప్రఖ్యాత ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ (ఈజీఓటీ) అవార్డు లన్నింటినీ అందుకున్న అరుదైన ప్రముఖుల జాబితాలో స్పీల్‌బర్గ్‌ స్థానం సంపాదించుకున్నారు. భారత్‌ నుంచి అనౌష్క శంకర్, సిద్ధాంత్‌ భాటి యాతో పాటు శక్తి ఫ్యూజన్‌బాండ్‌ కూడా పోటీపడ్డా ఎవరికీ అవార్డు దక్కలేదు.

దలైలామా హర్షం
ధర్మశాల: గ్రామీ అవార్డు పట్ల దలైలామా హర్షం వెలిబుచ్చారు. ‘‘ఈ పురస్కారాన్ని సవినయంగా, కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిస్తున్నా. ఇది వ్యక్తిగత ఘనత కాదు. ప్రపంచ పౌరులందరి సమష్టి భాగస్వామ్యానికి గుర్తింపు. శాంతి, కరుణ, పర్యావరణ పట్ల శ్రద్ధ, మానవ ఐక్యతపై స్పష్టమై న అవగాహన మానవాళి శ్రేయస్సుకు చాలా ము ఖ్యం. ఈ కీలక సందేశాన్ని మరింతగా చాటేందుకు గ్రామీ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుంది. అందుకు నిర్వాహకులకు కృతజ్ఞున్ని’’ అని పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)