Breaking News

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం : హై-స్పీడ్ రైళ్లు ఢీ

Published on Wed, 10/28/2026 - 15:44

మాడ్రిడ్‌ : స్పెయిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు హై-స్పీడ్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న భయంకర ప్రమాదంలో కనీసం 46 మంది ప్రాణాలు కోల్పోగా,అధిక సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.  

స్పెయిన్‌లోని మాడ్రిడ్ - అండలూసియా మార్గంలో లోస్ యెబెనెస్, ఉర్డా (టోలెడో) ప్రాంతాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. మాడ్రిడ్ నుండి సెవిల్లె వెళ్తున్న  రెంఫే అవే రైలు, ఎదురుగా వస్తున్న  ఇరియో కంపెనీకి చెందిన మరో హై-స్పీడ్ రైలును ఢీకొట్టింది. ఈ తీవ్రమైన దాటికి రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదుగా పడ్డాయి. ఈ ఘటనలో 46 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం.

ప్రధాని పెడ్రో శాంచెజ్ దిగ్భ్రాంతి 
టోలెడోలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంపై స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవాణా శాఖ మంత్రి, కాస్టిల్లా-లా మాంచా అధ్యక్షులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, బాధితులను ఆదుకోవడానికి అత్యవసర సేవల సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వెల్లడించారు.

ఒకే ట్రాక్ పై రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ... స్పాట్ లో 46 మంది..

దుర్ఘటనతో అగ్నిమాపక బృందాలు, మూడు హెలికాప్టర్లు, రెండు మొబైల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లతో సహా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నట్లు స్పానిష్ అత్యవసర సేవల ప్రతినిధి తెలిపారు. మరోవైపు, ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రధాని శాంచెజ్‌తో పాటు ఇతర రాజకీయ నాయకులు రాబోయే పార్లమెంటరీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో సహా నేటి అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)