Breaking News

గర్భంలో ఉండగానే కరోనా సోకిన పసికందులకు దెబ్బతిన్న మెదడు

Published on Sun, 04/09/2023 - 10:16

కరోనా మహమ్మారికి సంబంధించి పలు కథనాలు విన్నాం. గానీ గర్భంలో ఉండగానే శిశువులు ఈ మహ్మమారి బారిన పడిన తొలి కేసును గుర్తించి వైద్యలు షాక్‌కి గురయ్యారు. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.  ఇద్దరు తల్లులకు పుట్టిన శిశువుల్లో ఇలా జరిగిందని పరిశోధకులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. గర్భంలో ఉండగానే కరోనా బారిన పడటంతో రెండు శిశువుల బ్రెయిన్‌ హేమరేజ్‌తో జన్మించినట్లు యూఎస్‌లోని వైద్యులు వెల్లడించారు. ఇదే తొలికేసు అని కూడా తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్‌ మియామి తన పీడియాట్రిక్స్‌ జర్నల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకమునుపు జరిగినట్లు జర్నల్‌ పేర్కొంది. ఇద్దరు తల్లలు గర్భధారణ సమయంలోనే కరోనా బారిన పడినట్లు తెలిపారు.

ఐతే వారిలో ఒక తల్లికి తేలికపాటి లక్షణాలు కనిపించగా మరో తల్లి కరోనా కారణంగా తీవ్ర అనారోగ్య పాలైందని తెలిపారు. దీంతో వారికి పుట్టిన శిశువులు ఇద్దరు జన్మించిన వెంటనే ఫిట్స్‌తో బాధపడినట్లు తెలిపారు వైద్యులు. తర్వాత వారిలో సరైన విధుంగా పెరుగుదల కూడా లేకపోవడం గుర్తించినట్లు తెలిపారు. ఆ శిశువుల్లో ఒక శిశువు 13వ నెలలో మరణించగా మరోక శిశువు వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఇంతవరకు చిన్న పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరగలేదన్నారు. తొలిసారిగా ఆ శిశువులకు నిర్వహించగా కరోనా వైరస్‌ జాడలను గుర్తించినట్లు తెలిపారు.

చనిపోయిన శిశువుకి పోస్ట్‌మార్టం నిర్వహించగా మెదడులో కరోనా వైరస్ జాడలను గుర్తించామని, అందువల్లే మెదడు దెబ్బతిందని మియామి విశ్వవిద్యాలయ పరిశోధకుల వెల్లడించారు. అలాగే కరోనా బారిన పడి తీవ్రంగా అనారోగ్యం పాలైన తల్లికి కేవలం 32 వారాలకే డెలివరి చేశామని చెప్పారు. ఆమె శిశువే బాగా ఈ వైరస్‌ ప్రభావానికి గురై చనిపోయినట్లు తెలిపారు.

అందువల్ల దయచేసి గర్భధారణ సమయంలో కరోనా బారిని పడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీడీయాట్రిక్‌ వైద్యులను సంప్రదించాలని సూచించారు పరిశోదకులు. అయితే గర్భధారణ సమయంలో డెల్టా వేరియంటే లేదా ఓమిక్రాన్‌ వేరియంట్‌ బారిన పడితే ఈ విధంగా జరుగుతుందనేది స్పష్టం కాలేదని చెప్పారు పరిశోధకులు. ఇలా తల్లి మావి నుంచి శిశువుకి వైరస్‌ సంక్రమించిన తొలికేసు ఇదేనని మియామి విశ్వవిద్యాలయ గైనకాలజిస్టు మైఖేల్‌ పైడాసస్‌ చెబుతున్నారు.

(చదవండి: ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!)

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)