Breaking News

బిగ్‌ డిబేట్‌కు ముందు ట్రంప్‌కు ఊరట

Published on Wed, 06/26/2024 - 07:36

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల  క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్‌ డిబేట్‌కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్‌ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట లభించింది. హష్‌ మనీ కేసులో భాగంగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ కోర్టు గతంలో ట్రంప్‌పై విధించిన గ్యాగ్‌(సైలెన్స్‌) ఆంక్షలను కొద్దిగా సడలించింది.

సవరించిన ఆర్డర్‌ ప్రకారం హష్‌ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్‌నకు అనుమతి లభించింది.  అయితే  కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్‌ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. 

త్వరలో జరగబోయే డిబేట్‌లో డెమొక్రాట్‌ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్‌ లాయర్లు వాదించారు. ట్రంప్‌ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.

హష్‌ మనీ కేసులో ట్రంప్‌ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని  ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ ట్రంప్‌పై హష్‌ మనీ కేసు పెట్టింది. 

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్‌, జో బైడెన్‌ల బిగ్‌ డిబేట్‌ గురువారం(జూన్‌27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో  జో బైడెన్‌, ట్రంప్‌ పలు కీలక అంశాలపై  ముఖాముఖి చర్చించనున్నారు.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)