Breaking News

జాబిల్లి చిరునవ్వితే.. ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం!

Published on Fri, 01/23/2026 - 11:36

ఆకాశంలో అద్భుతం.. చందమామ, శని, నెప్ట్యూన్‌ల అరుదైన కలయిక!. వసంత రాత్రి వెన్నెలలో నక్షత్రాల మధ్య నవ్వు పూస్తే..  జనవరి 23, 2026.. అంటే ఇవాళ రాత్రి ఆకాశంలో ఖగోల అద్బుతం కనువిందు చేయనుంది. చంద్రుడు, శని(శాటర్న్‌), వరుడు(నెప్ట్యూన్‌) ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించనున్నాయి. ఈ త్రిగ్రహ సంయోగం (Triple Conjunction) ఒక మధురానుభూతిని అందించబోతోంది. అదే.. కాస్మిక్‌ స్మైల్‌!.

చంద్రుడు తన అర్థ ఆకారం పెరిగే క్రమంలో ఉండడం వల్ల(waxing crescent) ఉండటం వల్ల.. ఈ త్రిగ్రహ సంయోగం ఆకాశంలో చిరునవ్వు లాంటి ఆకారాన్ని సృష్టించనుంది. చిరునవ్వు షేప్‌లో చంద్రుడు.. ఆపైన రెండు కళ్ల ఆకారంలో శని, వరుణ గ్రహాలు చెరో పక్క కనిపింనుచన్నాయి. అయితే ఇలా ఏర్పడడానికి కారణం ఉంది.

ఖగోళ శాస్త్రంలో కాంజంక్షన్‌ అనేది సాధారణమైన విషయం. రెండు లేదంటే అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రేఖాంశంలో.. అదీ దగ్గరగా కనిపించే సంఘటన. అయితే ఇవాళ రాత్రి ఏర్పడబోయేది కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఈసారి చంద్రుడు శని కంటే కొన్ని డిగ్రీల ఉత్తరంగా వంగడం.. అదే ప్రాంతంలో నెప్ట్యూన్‌ కూడా కనిపించడం వల్ల ఈ అరుదైన సంయోగం ఏర్పడబోతోంది.

భారత్‌లో చూడొచ్చా?
సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో పశ్చిమం వైపు ఈ దృశ్యం అత్యంత స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం ఖగోళ శాస్త్రజ్ఞులకే కాకుండా.. ఫోటోగ్రాఫర్లకు, ఖగోళ ప్రేమికులందరికీ ఒక మధుర క్షణమనే చెప్పొచ్చు. అయితే.. చంద్రుడు, శని మన కంటికి సులభంగా కనిపించినప్పటికీ.. నెప్ట్యూన్‌ కాస్త మసకగా ఉండటం వల్ల దాన్ని చూడటానికి టెలిస్కోప్‌ అవసరం పడొచ్చు.

పసుపు వెలుగులో చంద్రుడు చిరునవ్వు, సంధ్యా సమయం పశ్చిమ దిక్కున.. ఆకాశంలో ఆహ్లాదకరం.. కాస్మిక్‌ స్మైల్‌గా మంత్రముగ్ధం చేసే క్షణం..

చంద్రుని నవ్వు (Moon–Saturn–Neptune triple conjunction) చాలా అరుదుగా జరుగుతుంది. అలాగని ఇదే మొదటిసారి కాదు. కిందటి ఏడాది జూన్ 19న కూడా ఇలాంటి అరుదైన సంయోగం ఏర్పడి.. ఆకాశంలో “స్మైలీ ఫేస్” లాంటి దృశ్యం కనిపించింది. మళ్లీ ఇవాళ.. ఈ ప్రత్యేక దృశ్యం మనకు దర్శనమివ్వబోతోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)