Breaking News

మహమ్మద్‌ ఖలీల్‌కు విముక్తి

Published on Sun, 06/22/2025 - 05:31

జెనా: అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసన కార్యక్రమాలు చేపట్టినందుకు అరెస్టయిన సామాజిక కార్యకర్త, గ్రాడ్యుయేట్‌ విద్యార్థి మహమ్మద్‌ ఖలీల్‌(30)కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయనను విడుదల చేయాలని యూఎస్‌ జిల్లా జడ్జి మైఖేల్‌ ఫార్బియార్జ్‌ ఆదేశించడంతో శుక్రవారం లూసియానాలో ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ నిర్బంధం నుంచి బయటకు వచ్చారు. 

వలసదారుల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి ఈ పరిణామంతో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. విద్యాసంస్థల్లో నిరసన వ్యక్తం చేస్తే అదుపులోకి తీసుకోవడం, బలవంతంగా దేశం నుంచి బయటకు వెళ్లగొట్టాలని చూడడం చట్టవిరుద్ధమని సాక్షాత్తూ న్యాయస్థానమే తేల్చిచెప్పింది. మహమ్మద్‌ ఖలీల్‌ న్యూయార్క్‌లోని తన కుటుంబం వద్దకు వెళ్లనున్నారు.

 అమెరికా పౌరసత్వం కలిగిన తన భార్యతోపాటు ఇటీవలే జన్మించిన తన బిడ్డను చూడబోతున్నారు. ‘‘చివరకు న్యాయమే గెలిచింది. కానీ, అందుకు చాలా సమయం పట్టింది’’అని ఖలీల్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఖలీల కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి మైఖేల్‌ ఫార్బియార్జ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చట్టబద్ధంగా అమెరికాలో ఉంటున్న విద్యార్థిని ఇలా నిర్బంధించడం అసాధారణం. 

హింసకు పాల్పడినట్లు ఖలీల్‌పై ఎలాంటి ఆరోపణలు లేవు. అతడు పారిపోయే అవకాశం లేదు. అయినా ఎందుకు నిర్బంధించారు? అతడి వల్ల అమెరికా సమాజానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఒక వ్యక్తిని నిర్బంధించే విషయంలో అమల్లో ఉన్న ప్రమాణాలను ప్రభుత్వం పాటించలేదు. ఖలీల్‌ను వెంటనే విడుదల చేయండి’’అని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఖలీల్‌ను విడుదల చేస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. నిబంధలన ప్రకారం.. ఖలీల్‌ తన పాస్‌పోర్టును ప్రభుత్వానికి సమరి్పంచాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు. అమెరికాలో పరిమితంగానే సంచరించవచ్చు.    

ఎవరీ మహమ్మద్‌ ఖలీల్‌?  
డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత విదేశీ విద్యార్థులపై దృష్టి పెట్టారు. వారిని బయటకు పంపించడమే లక్ష్యంగా పావులు కదిపారు. ఇందుకోసం లేనిపోని నిబంధనలు తీసుకొచ్చారు. చట్టాలు ఉల్లంఘించినా, విద్యాసంస్థల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా స్వదేశాలకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చాలామంది బలవంతంగా బయటకు వెళ్లగొట్టారు. అమెరికాలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు అరెస్టయిన మొట్టమొదటి విదేశీ విద్యార్థి మహమ్మద్‌ ఖలీల్‌. 

ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్లు ఈ ఏడాది మార్చి 8న అతడిని అదుపులోకి తీసుకున్నారు. లూసియాలోని మారమూల ప్రాంతమైన జెనాలో అతడిని నిర్బంధించారు. దాంతో ఖలీల్‌ న్యాయపోరాటం ప్రారంభించాడు. తనను విడుదల చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. న్యాయస్థానం అతడి వాదనను సమర్థించడంతో 104 రోజుల తర్వాత విడుదలయ్యాడు. ఖలీల్‌ అరెస్టు వ్యవహా­రం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విదేశీయులపై ట్రంప్‌ దాషీ్టకానికి ఈ ఘటన ఒక ప్రతీకగా నిలిచింది. ఖలీల్‌ 1995లో సిరియాలోని డెమాస్‌్కలో శరణార్థి శిబిరంలో పాలస్తీనా దంపతులకు జన్మించాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)