Breaking News

ఆన్‌లైన్‌లో ఎయిర్‌ ప్రైయర్‌ బుక్‌ చేస్తే బల్లిని డెలివరీ చేశారేంటి!

Published on Wed, 07/24/2024 - 15:45

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఇన్నిరోజులు ఫుడ్‌ ఆర్డర్‌ పెడితే  ఇటుక బిళ్లలు రావడం, ఫోన్‌ ఆర్డర్‌ పెడితే ధర్మకోల్‌ షీట్లు రావడం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అదే ఆన్‌లైన్‌లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్‌ పెడితే బల్లులు ప్రత్యక్షమవుతున్నాయి.

దక్షిణ అమెరికాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ ఎయిర్‌ ప్రైయర్‌ను అమెజాన్‌లో ఆర్డర్‌ పెట్టింది. ఆర్డర్‌ రానే వచ్చింది. వెంటన్‌ ఎయిర్ ఫ్రైయర్ ఎలా ఉందోనని పరిశీలించేందుకు పార్శిల్‌ తెరిచి చూసింది. అంతే పార్శిల్‌ లోపల ఉన్న బల్లిని చూసి వణికిపోయింది. వెంటనే తనకు ఎదురైన చేదు అనుభవంపై స్పందించింది.

అమెజాన్‌ పంపిన పార్శిల్‌ లోపల ఉన్న బల్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. నేను అమెజాన్‌లో ఎయిర్‌ ఫ్రైయర్‌  కోసం ఆర్డర్‌ పెట్టా. కానీ పార్శిల్‌లో బల్లి వచ్చింది. ఇది అమెజాన్‌ సంస్థ తప్పా లేదంటే కొరియర్‌ సంస్థది తప్పా అనేది తెలియదు’అంటూ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌పై అమెజాన్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. 

కాగా, అమెజాన్‌ పంపిన పార్శిల్‌లో బల్లి ఉండడంపై పలువురు నెటిజన్లు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు పార్శిల్‌ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఓపెన్‌ చేసి చూడాలి. ఓపెన్‌ చేసే సమయంలో వీడియో తీయడం మంచిది. అలా వీడియో తీయడం వల్ల మీరు పెట్టిన ఆర్డర్‌ ఒకటైతే..మీకు వచ్చిన వస్తువు మరొకటి అయినప్పుడు.. సదరు ఈకామర్స్‌ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు, తగిన నష్ట పరిహారం పొందేందుకు సులభతరం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)