Breaking News

విమానం మిస్సింగ్‌ విషాదాంతం.. 15 మంది దుర్మరణం

Published on Thu, 01/29/2026 - 07:39

బొగొటా: కొలంబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నపాటి విమానం కుప్పకూలి 15 మంది మరణించారు. మృతుల్లో కొలంబియా చట్ట సభ్యుడు కూడా ఒకరు ఉన్నారు. తొలుత విమానం అదృశ్యం కాగా.. ఎక్కడో దగ్గర సేఫ్‌ ల్యాండ్‌ అయి ఉంటుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరకు విషాదమే మిగిలింది. 

బుధవారం ఉదయం 11గం. సమయంలో 15 మందితో కూడిన సటేనా ఎయిర్‌లైన్స్‌ విమానం కుకుటా నుంచి ఒకానాకు బయల్దేంది. అయితే కాసేపటికే అది ఏటీసీ(air traffic control)తో సంబంధాలు తెగిపోయింది.  ఈ క్రమంలో ప్రయాణికుల క్షేమంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. నార్తె డె సంటాన్‌డెర్‌ ప్రావిన్స్‌లోని కురాసికా గ్రామం సమీపంలో అది కుప్పకూలింది. అది గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. 

ఆ వెంటనే ప్రమాదంపై కొలంబియా పౌరవిమానయాన శాఖ అధికారిక ప్రకటన చేసింది. కొలంబియా-వెనెజువెలా సరిహద్దు ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైందని.. ప్రమాదంలో అంతా మరణించారని.. మృతుల్లో 13 మంది ప్రయాణికులు.. ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని పేర్కొంది. విమానం ప్రమాదానికి గురైన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం. పైగా రెబల్‌ గ్రూప్స్‌నకు ఆవాసం. దీంతో మృతదేహాల రికవరీ కోసం ఆర్మీని రంగంలోకి దించింది. 

ఈ ఘటనలో పార్లమెంటేరియన్‌ డియోగెనెస్‌ క్విన్‌టెరో(Diógenes Quintero)తో పాటు మరో రాజకీయ నేత సాలకెడో కూడా ఉన్నారు. కొలంబియాలో అంతర్యుద్ధం కారణంగా నలిగిపోతున్న బాధితుల తరఫున క్విన్‌టెరో పోరాడుతున్నారు. సాలకెడో రాబోయే హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. 

సటేనా ఎయిర్‌లైన్స్‌ను కొలంబియా ప్రభుత్వమే నడిపిస్తోంది. ఘటనపై దిగ్భ్‌రాంతి వ్యక్తం చేసిన ఎయిర్‌లైన్స్‌.. దర్యాప్తునకు సహకరిస్తామని అంటోంది. ప్రమాదానికి గురైన బీచ్‌క్రాఫ్ట్‌ 1900 తేలికపాటి విమానం కండిషన్‌లోనే ఉందని చెబుతోంది.  

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)