ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
గనిలో అగ్ని ప్రమాదం
Published on Sun, 10/29/2023 - 05:53
లండన్: కజఖిస్తాన్‌లోని కొస్టెంకో బొగ్గు గనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 32 మంది కార్మికులు చనిపోగా మరో 14 మంది గల్లంతయ్యారు. లగ్జెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఈ విషయం తెలిపింది. శనివారం ప్రమాద సమయంలో గనిలో 252 మంది కారి్మకులు పనిచేస్తున్నారని వివరించింది.
మీథేన్ గ్యాస్ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్. ఈ సంస్థకు అనుబంధంగా కజఖిస్తాన్‌లో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ పనిచేస్తుంది. ఘోర ప్రమాదం నేపథ్యంలో కజఖ్ ప్రభుత్వం ..దేశంలో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను జాతీయం చేసింది.
#
Tags : 1