Breaking News

రెండేళ్ల తర్వాత బెత్లెహాంకు క్రిస్మస్‌ శోభ 

Published on Thu, 12/25/2025 - 05:49

జెరూసలెం: ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర బెత్లెహాం రెండేళ్ల అనంతరం క్రిస్మస్‌ శోభతో మెరిసిపోతోంది. వేలాది విశ్వాసులు ఈ పవిత్ర చరిత్ర నగరానికి బారులు తీరుతున్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో రెండేళ్లుగా ఇక్కడ క్రిస్మస్‌ సంబరాలు పెద్దగా జరగకపోవడం తెలిసిందే.  తాత్కాలిక కాల్పుల విరమణతో ప్రస్తుతానికి కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొనడంతో ఈ క్రిస్మస్‌ కు బెత్లెహాం భారీ స్థాయిలో ముస్తాబవుతోంది. చారిత్రక మాంగర్‌ స్క్వేర్‌ లో సుదూరాలకు కూడా కనిపించేంతటి భారీ క్రిస్మస్‌ ట్రీ అందరినీ అలరిస్తోంది. 

కార్డినల్‌ పియర్‌ బటిస్టా పిజాబెల్లా సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వాసులు సంప్రదాయం మేరకు ఆడుతూ పాడుతూ నృత్యగానాలు చేస్తూ జెరూసలెం నుంచి ప్రదర్శనగా బెత్లెహాం చేరుకున్నారు. అయితే ఈసారి విదేశీయులు మాత్రం అతి తక్కువగా కనిపించారు. క్రిస్మస్‌ సీజన్లో మామూలుగా జరిగే వ్యాపారం లేక ఈసారి స్థానిక ముస్లింల దుకాణాలు దిగాలుపడి కనిపిస్తున్నాయి. బెత్లెహాం కు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం దెబ్బకు రెండేళ్లుగా అది దాదాపుగా నిండుకుంది. యుద్ధ విరామం నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం మళ్లీ కాస్త కళకళలాడుతోందని స్థానికులు అంటున్నారు. వెస్ట్‌ బ్యాంక్‌ లోని 30 లక్షల జనాభాలో క్రైస్తవులు 2 శాతం ఉండరు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)