ట్రంప్‌, హారిస్‌ ప్రచారంపై చైనా హ్యాకర్ల టార్గెట్‌!

Published on Sat, 10/26/2024 - 09:18

న్యూయార్క్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరుపార్టీల అధ్యక్ష అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థల ప్రచారంపై చైనా హ్యాకర్లు టార్గెట్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డెమొక్రటిక్‌ పార్టీ   అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఉపయోగించే ఫోన్లను చైనా హ్యాకర్లు.. హ్యాక్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ , ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్‌ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ట్రంప్, వాన్స్ ప్రచారాన్ని చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రంప్ బృందం ధృవీకరించకపోవటం గమనార్హం. అయితే హ్యాక్‌ విషయంలో ట్రంప్‌ బృందం​ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలవకుండా అడ్డుకోవడానికి వైస్ ప్రెసిడెంట్  కమలా హారిస్ చైనా, ఇరాన్‌లను ప్రోత్సహించారని ట్రంప్‌ ప్రచార కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్  ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంపై  వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. ‘హ్యాకింగ్‌కు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మాకు తెలియదు. చైనా అన్ని రకాలుగా సైబర్ దాడులు, సైబర్ దొంగతనాలను వ్యతిరేకిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది’ అని పేర్కొంది. ‘‘అధ్యక్ష ఎన్నికలు అమెరికా దేశీయ వ్యవహారాలు. వాటిపై చైనాకు ఎటువంటి ఉద్దేశ్యం లేదు. అమెరికా ఎన్నికలలో చైనా జోక్యం చేసుకోదు’’ అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఇక.. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ప్రచారంపై హ్యాక్ జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లోని ముగ్గురు సభ్యులపై ఆమెరికా ఆరోపణలు చేసింది. వారు నవంబర్ 5న  జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొంది.

చదవండి: అడ్వాంటేజ్‌ డొనాల్డ్‌ ట్రంప్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)