Breaking News

అమెరికా కోవిడ్‌ డేటా చోరీ.. ఇటలీలో చైనీస్ హ్యాకర్‌ అరెస్ట్‌

Published on Thu, 07/10/2025 - 08:18

రోమ్: కోవిడ్‌ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న 2020లో చైనా నిఘా సంస్థ తరపున అమెరికాకు సంబంధించిన కోవిడ్-19 వ్యాక్సిన్ రహస్యాలను దొంగిలించిన హ్యాకర్‌, చైనా పౌరుడు జు జెవే(33)ను ఇటాలియన్ అధికారులు అరెస్టు చేశారు. ఇతనిపై అమెరికా.. అంతర్జాతీయ వారెంట్ జారీ చేసిన దరిమిలా, మిలన్‌లోని మాల్పెన్సా విమానాశ్రయంలో అతనిని అరెస్టు చేసినట్లు ఇటాలియన్ అధికారులు మీడియాకు తెలిపారు.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు, చికిత్స, పరీక్షలపై పరిశోధనలు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు, రోగనిరోధక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులను లక్ష్యంగా చేసుకుని చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జెవే పనిచేశారని అమెరికా ఆరోపిస్తోంది. చైనాలో  తలదాచుకుంటున్న జాంగ్ యు అనే మరో హ్యాకర్‌ కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే ఆరోపణలున్నాయి. హ్యాకింగ్‌కు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్న జెవేను అమెరికా న్యాయ శాఖ మిలాన్ కోర్టులో హాజరుపరిచింది.

వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం, జెవే కేసు గురించి తమకు తెలియదని, అయితే గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని, దీనిపై చైనా ఇప్పటికే ఈ తన వైఖరిని ప్రకటించిందని పేర్కొంది. వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధికి ప్రపంచంలోనే చైనా పేరొందింది. దొంగతనంగా వ్యాక్సిన్‌ల డేటాను పొందే అవసరం  చైనాకు లేదని చైనా ఎంబసీ ప్రతినిధి లియు పెంగ్యు ఒక ప్రకటనలో తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)