Breaking News

అగ్రరాజ్యంపై చైనా సీరియస్‌..వేలు పెట్టొద్దంటూ చురకలు

Published on Mon, 02/20/2023 - 15:08

నిఘా బెలూన్ల వ్యవహారంతో అమెరికా-చైనా దేశాల మధ్య వివాదం నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌.. చైనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఆయుధాలు ఇచ్చే యోచన చేస్తోందంటూ.. చైనాపై ఆరోపణలు చేశారు బ్లింకెన్‌. దీంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్బిన్‌ శాంతి నామం జపిస్తూ.. యుద్ధ భూమికి ఆయుధాలను పంపిస్తోంది అమెరికానే గానీ చైనా కాదంటూ విరుచుకుపడ్డారు.

తన చర్యలను కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై నిందలు మోపేందుకు తెగబడటమే గాక తప్పుడూ సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలను మానుకోవాలంటూ గట్టి కౌంటరిచ్చారు వాంగ్‌. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్రే పోషిస్తోందని, చర్చలతో సామరస్యం పూర్వకంగా పరిష్కిరించుకునే వైపే మొగ్గుచూపిందని వాంగ్‌ చెప్పుకొచ్చారు. అలాగే రష్యా చైనా సంబంధాల విషయంలో అమెరికా వేలు పెట్టేందుకు యత్నించవద్దని, దీన్ని తాము అంగీకరించమని వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ సమస్యపై చైనా సదా శాంతినే కోరింది, చర్చలనే ప్రోత్సహించిందని వాంగ్‌ వెన్బిన్‌ స్పష్టం చేశారు.

(చదవండి: మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)