Breaking News

భారత్‌-చైనా సంబంధాల్లో మరో మలుపు.. ఎరువుల సరఫరాకు చైనా ఓకే

Published on Tue, 08/19/2025 - 09:40

న్యూఢిల్లీ: భారత్‌- చైనా సంబంధాలు ఉద్రిక్తతల దశ నుంచి సాధారణ స్థాయికి క్రమంగా చేరుకుంటున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా  వాంగ్ యి తమ దేశం భారత్‌కు అవసరమైన ఎరువులు, అరుదైన భూ ఖనిజాలు,  టన్నెల్ బోరింగ్ యంత్రాలు (టీబీఎం) సరఫరాను తిరిగి ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు.

గత నెలలో జైశంకర్  తన చైనా పర్యటనలో.. యూరియా, అరుదైన భూ ఖనిజాలు, టీబీఎం సరఫరాల అంశాన్ని  చైనా మంత్రి వాంగ్ యి దగ్గర ప్రస్తావించారు. దీనికి ఇప్పుడు చైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. కాగా తైవాన్‌ విషయంలో భారత వైఖరిలో ఎటువంటి మార్పు లేదని విదేశాంగ మంత్రి జైశంకర్  చైనా ప్రతినిధి ఎదుట స్పష్టం చేశారు.

చైనా ఏడాదిగా భారత దిగుమతులపై బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడు తాజాగా చైనా తమ దేశపు ఎరువులు, టీబీఎం,  అరుదైన భూ ఖనిజాలను సరఫరా చేయడానికి అంగీకరించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయడానికి ఉదాహరణగా నిలిచింది. ఇకపై చైనా దాదాపు 30 శాతం ఎరువులను భారతదేశానికి సరఫరా చేయనుంది. అలాగే అరుదైన భూ ఖనిజాలను పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి టన్నెల్ బోరింగ్ యంత్రాలను సరఫరా చేయనుంది.

జైశంకర్-వాంగ్ సమావేశంలో సరిహద్దులకు సంబంధించిన చర్చలేవీ జరగలేదు. దీనిపై ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్  చర్చించనున్నారని సమాచారం. వీరి భేటీ ప్రధానంగా 3488 కి.మీ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)పై బలగాల తీవ్రతను తగ్గించడంపై దృష్టి పెట్టనుంది. లడఖ్‌లో సరిహద్దు ఘర్షణ,పెట్రోలింగ్ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. భారత్‌- చైనా సైన్య బలగాలు ఇప్పటికీ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు