Breaking News

చంద్రునిపై చైనా ల్యాండర్

Published on Sun, 06/02/2024 - 16:09

బీజింగ్‌: చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్‌ చాంగే-6 చంద్రునిపై మనకు కనిపించని అవతలి వైపు ల్యాండ్‌​ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చైనా కాలమానం ప్రకారం ఆదివారం(జూన్‌2) ఉదయం అయిట్కిన్‌ బేసిన్‌ అనే పేరుతో పిలుచుకునే ప్రాంతంలో చాంగే-6 సురక్షితంగా దిగినట్లు తెలిపింది. 

చాంగే-6 అక్కడి శాంపిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి భూమికి బయల్దేరనుండటం విశేషం. మే3వ తేదీన చాంగే-6 భూమి నుంచి బయలుదేరి 53 రోజులు ప్రయాణించి చంద్రున్ని చేరింది.  రోబోల సాయంతో చంద్రునిపై తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టి శాంపుల్స్‌ తీసుకోనుంది. 

తర్వాత లూనార్‌ ల్యాండర్‌లోని అసెండర్‌ మాడ్యూల్‌ చంద్రుడిపైకి లేచి చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌తో అనుసంధానమవతుంది.  ఆర్బిటర్‌ మళ్లీ భూమి దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది.  ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్‌ శాంపుల్స్ తీసుకుని భూమిపైన దిగుతుంది. 

చంద్రుడి అవతలివైపు మొత్తం గోతులతో నిండి ఉండటం వల్ల అటువైపు ల్యాండ్‌ అయి వ్యోమనౌకలు తిరిగి రావడం అంత సులువు కాదు. అయితే చైనా ఈ ఫీట్‌ను సాధిస్తే 2030లో చంద్రునిపై వ్యోమగాములను పంపేందుకు మార్గం సుగమం అయినట్లే.  

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)