Breaking News

తైవాన్‌ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు

Published on Sun, 08/20/2023 - 06:13

బీజింగ్‌: చైనా, తైవాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్‌ ఉపాధ్యక్షుడు విలియం లాయ్‌ చెంగ్‌–తె ఇటీవల పరాగ్వే పర్యటకు వెళ్లి తిరిగి వస్తూ శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌ నగరాల్లో ఆగారు. దీంతో డ్రాగన్‌ దేశం తైవాన్‌కు తీవ్ర హెచ్చరికలు పంపింది. ద్వీపం చుట్టూ శనివారం సైనిక విన్యాసాలకు దిగింది. వేర్పాటువాదులు, విదేశీ శక్తుల కవి్వంపు చర్యలకు ప్రతిగానే తాము ఈ మిలటరీ డ్రిల్స్‌ చేపట్టినట్టుగా చైనా రక్షణ శాఖ వెల్లడించింది.

యుద్ధ విమానాలు, నౌకల్ని కూడా మోహరించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. తైవాన్‌ను శాశ్వతంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఉపాధ్యక్షుడు విలియం అమెరికాలోని న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో పర్యటించారు. తైవాన్‌ తమ దేశంలో భాగమని అంటున్న చైనా విలియం లాయ్‌ పర్యటనకి హెచ్చరికగా ఇదంతా చేస్తోంది. మరోవైపు చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి రావడంపై తైవాన్‌ మండిపడింది. శనివారం ఉదయం నుంచి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు రావడం కవి్వంపు చర్యలకి దిగడమేనని తైవాన్‌ రక్షణ శాఖ పేర్కొంది. తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేసింది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు