Breaking News

China: భవిష్యత్ యుద్ధాల్లో ఇక విధ్వంసమే..!

Published on Mon, 08/14/2023 - 16:52

ఆయుధ శక్తి టెక్నాలజీలో చైనా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఖండాంతరాలు దాటే ఆయుధ శక్తిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లేజర్ వ్యవస్థ అనంత దూరం వెళ్లే విధంగా కూలింగ్ సిస్టమ్‌ను తయారు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని నేషనల్ యూనివర్సిటీ డిఫెన్స్ టీం వెల్లడించింది. 

‍అత్యంత శక్తివంతమైన లేజర్‌లను ప్రయోగించేప్పుడు అత్యధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇదే అతిపెద్ద అవరోధంగా మారేది. దీని కారణంగా ఆయుధాల్లో సాంకేతిక లోపాలు వస్తుండేవి. ఇలా కాకుండా ప్రస్తుతం లేజర్ ఎంత శక్తి ఉత్పత్తి చేసినా.. అందుకు అనుగుణంగా పనిచేసే కూలింగా వ్యవస్థను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల లేజర్లు ఎంత దూరమైనా తమ కాంతిశక్తి పంపించగలవు. అధిక శక్తి లేజర్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో ఇది ఒక భారీ పురోగతి అని లేజర్ ఆయుధ శాస్త్రవేత్త యువాన్ షెంగ్‌ఫు తెలిపారు. లేజర్ వ్యవస్థల అభివృద్ధిలో కూలింగ్ సిస్ఠమ్ అతిపెద్ద సవాలుగా ఉండేదని అన్నారు. 

హై గ్రేడ్ లేజర్ సిస్టమ్‌లను అభివృద్ధి పరచడంలో అమెరికా కూడా ప్రయత్నాలను మొదలుపెట్టింది. నావీ అడ్వాన్సుడ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫారెడ్ అడ్వాన్స్‌డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్‌ లేజర్‌లను అభివృద్ధి చేసింది. ఈ లేజర్‌లను క్షేత్రస్థాయిలో కూడా ప్రయోగించింది. ఈ లేజర్‌లు సూపర్ సోనిక్ మిసైల్‌లను కూడా ధ్వంసం చేయగలుగుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆవిష్కరణతో లేజర్‌లు ఎంత దూరమైనా తమ శక్తిని ప్రసరింపజేయగలవు. 

లేజర్ అనేది  కృత్రిమంగా సృష్టించిన ఓ ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్‌. ఒకే రకమైన తరంగదైర్ఘ్యాలతో సన్నగా అతి ఎక్కువ దూరం ప్రయాణించడం దీని ప్రత్యేకత అని నాసా తెలిపింది.   
ఇదీ చదవండి: Amphibious Caravan: ఈ క్యారవాన్‌కు లైసెన్స్‌ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్‌ స్పీడ్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)