Breaking News

అమెరికాలో వివాహేతర సంబంధం.. అందుకే పదవి ఊడింది..

Published on Tue, 09/19/2023 - 18:38

న్యూయార్క్‌: చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్‌ గ్యాంగ్‌ అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని చైనా దర్యాప్తులో తేలినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.  ఈ కారణంగానే చైనా ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. క్విన్ గ్యాంగ్ వివాహేతర సంబంధంతో అమెరికాలో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని వాల్ స్ట్రీట్ పేర్కొంది. 

అమెరికాలో వివాహేతర సంబంధంతో ఓ బిడ్డకు క్విన్ గ్యాంగ్ తండ్రి అయ్యాడని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో క్విన్ గ్యాంగ్ దేశ భద్రతను పణంగా పెట్టారా..?లేదా..? అనే అంశంపై చైనా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరమైన పోటీ నడుస్తున్న క్రమంలో ఈ అంశం చైనాకు పెను సవాలుగా మారింది.

క్విన్ గ్యాంగ్‌ను నియమించిన ఏడు నెలలకే చైనా అయన్ని పదవి నుంచి తొలగించింది. ఇంత తక్కువ సమయంలో పదవి నుంచి తొలగించడానికి గల కారణాలను కూడా చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇలాంటి అస్థిరమైన నిర్ణయాలతో జిన్‌పింగ్ ప్రభుత్వం  కూడుకుని ఉందని వాల్‌స్ట్రీట్ పేర్కొంది.  చైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు విదేశాల్లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలోను దర్యాప్తులు జరుగుతున్నట్లు వెల్లడించింది. 

ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)