Breaking News

చైనాలో కొత్త వైరస్‌ కలకలం 

Published on Fri, 01/03/2025 - 06:38

బీజింగ్‌: విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడను ఒక్కసారిగా ప్రశ్నార్థంచేసి మహా మహమ్మారిగా ప్రపంచదేశాలను చుట్టేసిన కరోనా వైరస్‌ భయాల నుంచి తేరుకున్న పౌరులకు చైనా మరో భయపెట్టే వార్త మోసుకొచ్చింది. చైనాలో ఇప్పుడు కొత్తగా హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) వ్యాప్తిచెందుతోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. కోవిడ్‌ సంక్షోభం సమసిపోయిన ఐదేళ్లకు మళ్లీ అదే డ్రాగన్‌ దేశం నుంచి వైరస్‌ వార్త వెలువడటంతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొత్త వైరస్‌ విజృంభణ, దాని విస్తృతి, సాంక్రమణ శక్తి సామర్థ్యాలపై వెంటనే ఆలోచనల్లో పడ్డాయి. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్తితిపై ఆరా తీస్తున్నాయి. 

చైనాలో పలు ప్రాంతాల్లో హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాప్తి చెందినట్లు వార్తలొచ్చాయి. పుకార్ల వార్తలకు మారుపేరుగా దుష్కీర్తిని మూటగట్టుకున్న సోషల్‌మీడియాలో ఇప్పటికే కొత్త వైరస్‌పై  వార్తలు వెల్లువెత్తాయి. చైనాలో హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైసోప్లాస్మా నిమోనియో, కోవిడ్‌19లు విజృంభించాయని, చైనా అత్యయిక ఆరోగ్య స్థితిని విధించారని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు షేర్‌ చేసిన వీడియోల్లో చైనీయులు ఆస్పత్రులు, శ్మశానాల వద్ద క్యూ లైన్లు కనిపించిన దృశ్యాలున్నాయి. అయితే ఈ వార్తలను ఇంతవరకు చైనా ప్రభుత్వంగానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థగానీ ధృవీకరించలేదు. ఇది పాత వైరస్సేనని కొందరు వైద్యులు చెబుతుండటం గమనార్హం.

చైనాలో కొత్త వైరస్

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)