Breaking News

'కరోనా వైరస్‌ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు..

Published on Wed, 06/28/2023 - 16:41

చైనాలోని వుహాన్ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని చెప్పారు. బయోవెపన్‌గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందని అన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృంధానికే అప్పగించినట్లు చెప్పారు. మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జంగ్‌తో జరిగిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు.

ప్రభావవంతమైన కరోనా రకాలను గుర్తించాలని చావో షాన్‌తో సహా తమ సహచర పరిశోధకులకు బాధ్యతను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో నంజిన్ నగరంలో చావో షాన్‌కు స్వయంగా నాలుగు రకాల కరోనాలను పరిశోధనల నిమిత్తం ఇచ్చారని చెప్పారు. అందులో ఓ రకం అత్యంత వ్యాప్తి చెందగల శక్తి ఉన్నది గుర్తించినట్లు వెల్లడించారు.

చావో కరోనా వైరస్‌ను ఓ బయోవెపన్‌గా వ్యాఖ్యానించారు. 2019 నుంచి తమ సహచర పరిశోధకులు కనిపించకుండా పోయారని చెప్పారు. పరిశోధనల కోసం మరికొందర్ని అతర దేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి చేయడానికే  తమ సహచరులను ఇతర దేశాలకు పంపించినట్లు చావో అనుమానించారు.

ఇదీ చదవండి: ‘వుహాన్‌ ల్యాబ్‌’ నివేదికలో అదిరిపోయే ట్విస్ట్‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)