Breaking News

చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు

Published on Sat, 11/30/2024 - 06:33

బీజింగ్‌: చైనా న్యాయస్థానం గూఢచర్యం ఆరోపణలున్న సీనియర్‌ జర్నలిస్ట్‌ డాంగ్‌ యుయు(62)కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. చైనాలో స్వేచ్ఛ, పాలనా సంస్కరణల కోసం పోరాడుతున్న అతికొద్ది మందిలో డాంగ్‌ ఒకరు. అధికార కమ్యూనిస్ట్‌ పార్టీకి అనుకూలంగా ఉండే ఐదు ప్రధాన పత్రికల్లో గ్వాంగ్‌మింగ్‌ డైలీ ఒకటి. ఈ పత్రికలో ఎడిటోరియల్‌ విభాగం డిప్యూటీ చీఫ్‌ అయిన డాంగ్‌ 2022లో బీజింగ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జపాన్‌ దౌత్యాధికారితో చర్చలు జరుపుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జపాన్‌ ప్రభుత్వం నిరసన తెలపడంతో ఆ దేశ దౌత్యాధికారిని కొద్ది గంటల తర్వాత విడిచిపెట్టారు.

 డాంగ్‌ మాత్రం అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా అమెరికా, జపాన్‌ తదితర దేశాల అధికారులతో సమావేశాలు జరపడం నచ్చని ప్రభుత్వం ఆయనపై గూఢచర్యం ఆరోపణలు మోపింది. శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 1989లో బీజింగ్‌లోని తియాన్మెన్‌ స్క్వేర్‌లో నిరసనలకు దిగిన వేలాది మంది విద్యార్థుల్లో డాంగ్‌ కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన అరెస్టయ్యారు. పలు జపాన్‌ యూనివర్శిటీల్లో విజిటింగ్‌ ఫెలోగా, ప్రొఫెసర్‌గాను ఆయన పనిచేశారు. న్యూయార్క్‌ టైమ్స్‌కు పలు వ్యాసాలు రాశారు. 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)