Breaking News

క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవిత ఖైదు

Published on Tue, 12/31/2024 - 05:03

బీజింగ్‌: క్లాస్‌మేట్‌ను దారుణంగా చంపిన నేరానికి గాను ఇద్దరు టీనేజర్లకు చైనా న్యాయస్థానం కఠిన జైలు శిక్షలు విధించింది. వీరిలో ఒకరికి జీవిత ఖైదు, మరొకరికి 12 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మరో టీనేజర్‌ను కరెక్షన్‌ సెంటర్‌కు పంపించింది. హెబీ ప్రావిన్స్‌లోని హండన్‌లో ఈ ఏడాది మార్చిలో చోటుచేసుకున్న ఈ ఘటన చైనాలో సంచలనం కలిగించింది. 

బాధితుడు, దోషుల వయస్సు 13 ఏళ్లు. అందుకే అధికారులు వీరిని క్లుప్తంగా ఇంటి పేర్లతో వెల్లడించారు. క్లాస్‌మేట్‌ వాంగ్‌ను కొంతకాలంగా ఝాంగ్, లి, మా అనే బాలురు వేధిస్తున్నారు. వాంగ్‌ను చంపాలని ఝాంగ్‌ పథకం వేశాడు. దాని ప్రకారం మార్చి 3న నగరం శివార్లలోని పాడుబడ్డ గ్రీన్‌ హౌస్‌కు అతడిని తీసుకెళ్లాడు. అనుకున్న ప్రకారం మిగతా ఇద్దరూ అక్కడికి వచ్చారు. వాంగ్‌ను ఝాంగ్‌ పారతో కొట్టడం మొదలుపెట్టగా అతడికి లి సహకరించాడు. 

ఇది చూడలేక మా అక్కడికి నుంచి వెళ్లిపోయాడు. దెబ్బలతో చనిపోయిన వాంగ్‌ను ఇద్దరూ కలిసి అక్కడున్న గుంతలో పూడ్చి వేశారు. మార్చి 10న పోలీసులు ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగుచూసింది. సోమవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం..ఇది చాలా హేయమైన, క్రూరమైన చర్యగా అభివరి్ణంచింది. నేరానికి ప్రధాన సూత్రధారి ఝాంగ్‌కు జీవిత ఖైదును, అతడికి సహకరించిన లి కి 12 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 

మూడో బాలుడు మా ను పరివర్తన విద్యాకేంద్రానికి పంపించాలని తీర్పు వెలువరించింది. అయితే, వీరిని ఈ నేరానికి పురిగొలి్పన అసలు కారణాలు మాత్రం తెలియరాలేదు. కోర్టు తీర్పుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. కఠిన శిక్షల భయం లేనందునే పిల్లలు కూడా ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ నలుగురి తల్లిదండ్రులు నగరానికి పనుల నిమిత్తం వెళ్లిపోగా, అమ్మమ్మతాతల వద్ద ఉంటూ అల్లరిచిల్లరగా తిరగడం అలవాటు చేసుకున్నారని చెబుతున్నారు. 2020 నాటి గణాంకాల ప్రకారం ఇలా ‘వదిలివేయబడిన బాలలు’దేశంలో 6.70 కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా.  
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)