Breaking News

New York: ‘మోమోస్’తో మమ్దానీ.. లంచ్ మీట్‌ స్పెషల్‌

Published on Thu, 11/06/2025 - 11:49

న్యూయార్క్: న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించి, సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అమెరికాలోని ప్రముఖ నగరానికి సారధ్యం వహించే తొలి ముస్లిం నేతగా, ఈ పదవిని చేపట్టిన మొదటి దక్షిణాసియా వ్యక్తిగా, అత్యంత పిన్నవయస్కుడు(34)అయిన మేయర్‌గా గుర్తింపు పొందారు.

న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తొలిరోజున డెమొక్రాట్ ఫైర్‌బ్రాండ్ అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌తో పాటు లంచ్‌ మీట్‌లో భారతీయ భోజనం చేశారు. భారత సంతతికి చెందిన మమ్దానీ తన మొదటి రోజు షెడ్యూల్‌ ఇంటర్వ్యూలు, సమావేశాలతో గడిచింది. అయితే  ‘జాక్సన్ హైట్స్‌లోని లాలిగురాస్ బిస్ట్రోలో మా కాంగ్రెస్ మహిళా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌తో కలసి భోజనం చేయడం ఎంతో ప్రత్యేకమైనది’ అని జోహ్రాన్ మమ్దానీ తన ‘ఎక్స్‌’ పోస్టులో తెలిపారు.
 

దీనికి సంబంధించిన ఫొటోలో భారతీయ వంటకాలైన మోమోలు, దమ్‌ ఆలూ,  పనీర్ టిక్కాతోపాటు టీని వారు  ఆస్వాదించినట్లు తెలుస్తోంది. ఇది అతని దక్షిణాసియా వారసత్వానికి గుర్తుగా కనిపిస్తోంది. లాలిగురాస్ బిస్ట్రో అనేది  జాక్సన్ హైట్స్‌లోని ఒక భారతీయ- నేపాలీ రెస్టారెంట్. కాగా మమ్దానీ మేయర్ పదవికి పోటీ పడేందుకు మద్దతు పలికిన కొద్దిమంది డెమొక్రాట్లలో ఒకాసియో-కోర్టెజ్ కూడా ఉన్నారు. మమ్దానీ తన తొలి ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగంలోని వాక్యాలను గుర్తుచేశారు. మేయర్‌ విజయోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ధూమ్’ సినిమా బీట్స్ వినిపించాయి.

ఇది కూడా చదవండి: ‘పిచ్చి పని’.. రాహుల్‌ ‘ఫొటో’పై కంగుతిన్న మోడల్‌ 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)