Breaking News

చాద్‌ అధ్యక్ష భవనంపై దాడి!

Published on Fri, 01/10/2025 - 06:30

ఇంజమెనా (చాద్‌): మధ్య ఆఫ్రికా దేశం చాద్‌లో దేశాధ్యక్ష భవనంపై దాడికి విఫల యత్నం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిని భగ్నం చేసినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. దాడి సమయంలో అధ్యక్షుడు మహమత్‌ దెబీ ఇత్నో భవనం లోపలే ఉన్నట్టు ధ్రువీకరించింది. అయితే, ‘దాడిని తిప్పికొట్టాం. భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది ముష్కరులు హతమయ్యారు. ఆరుగురిని బందీలుగా పట్టుకున్నాం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది‘ అని చాద్‌ విదేశాంగ మంత్రి అబ్దరమాన్‌ కౌలామల్లాహ్‌ తెలిపారు. 

రాజ్యాంగబద్ద పాలనను అమలుచేస్తున్నందుకు అభినందించేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ చాద్‌కు వచ్చి అధ్యక్షుడిన కలిసిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఇది ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ బొకో హరాం పని కావచ్చన్న అనుమానాలను తోసిపుచ్చారు. ‘జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చు. దాడికి పాల్పడ్డ వాళ్లంతా తప్ప తాగి అన్నారు. డ్రగ్స్‌ మత్తులో కనిపించారు. వారంతా రాజధానికి చెందిన దారి తప్పిన యువకులే‘ అని ఆయన అన్నారు. దాదాపు 1.8 కోట్ల జనాభా ఉన్న చాద్‌ దేశంలో కొంతకాలంగా రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు