Breaking News

చైనా దురాక్రమణను భారత్‌ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం

Published on Sat, 03/22/2025 - 09:08

న్యూఢిల్లీ: చైనా దుందుడుకు వ్యవహారిశైలిపై భారత్‌ మరోమారు మండిపడింది. భారత్‌కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని భారత్‌ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది. ఇటీవల చైనా(China) రెండు కొత్త కౌంటీలను సృష్టించింది. వీటిలో కొంత ప్రాంతం భారత్‌లోని లడఖ్‌లో ఉంది. దీనిపై భారత్‌ బలమైన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు పార్లమెంటులో పేర్కొంది.

లోక్‌సభ(Lok Sabha)లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందిస్తూ.. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదని, ఆ దేశపు కొత్త కౌంటీల ఏర్పాటు.. భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన దీర్ఘకాల వైఖరిని ప్రభావితం చేయబోదన్నారు.  చైనా పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణను భారత్‌ చట్టబద్ధం చేయబోదన్నారు.

లడఖ్‌లోని భారత భూభాగాన్ని కలుపుకొని హోటాన్ ప్రావిన్స్‌లో చైనా రెండు కొత్త కౌంటీలను సృష్టించడం గురించి ప్రభుత్వానికి తెలుసా? అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యలు తీసుకుందో తెలపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను  అడినప్పుడు సింగ్  ఈ సమాధానం చెప్పారు. చైనాలోని హోటాన్ ప్రావిన్స్‌లో రెండు కొత్త కౌంటీల ఏర్పాటుకు సంబంధించి చైనా చేసిన ప్రకటన గురించి భారత ప్రభుత్వానికి తెలుసని, ఈ కౌంటీల అధికార పరిధిలోని కొన్ని ప్రాంతాలు భారతదేశంలోని లడఖ్(Ladakh) కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోకి వస్తాయన్నారు. సరిహద్దు ప్రాంతాలలో చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని కూడా ప్రభుత్వానికి కూడా తెలుసునని ఆయన అన్నారు. దీనిని నివారించేందుకే  భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తద్వారా  భారత్‌ తన వ్యూహాత్మక, భద్రతా అవసరాలను మెరుగుపరుచుకుంటుందన్నారు. 

ఇది కూడా చదవండి: కొలంబియా వర్శిటీపై ట్రంప్‌ ఉక్కుపాదం
 

Videos

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

అమెరికా హెచ్-1బీ వీసా వ్యవస్థలో, భారత్ కేంద్రంగా బయటపడ్డ మహా కుంభకోణం

కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ బ్యాడ్ టైం అంటే ఇదేరా బుద్దోడా

ఆనం వెనక్కి పో.. నిమ్మల ముందుకు రా వీడియో వైరల్..

YSR పై పాట ఇరగదీసిండు.. ఇది పక్కా ఊరోడి కథ

రష్మిక హెల్త్ ఎలా ఉంది? వదిన నన్ను ముద్దుగా ఏమని పిలుస్తాదంటే?

బాగానే గుండు కొట్టారు.. బ్యాంకింగ్ వ్యవస్థపై విజయ్ మాల్యా వైరల్ కామెంట్స్

ఫుట్ బాల్ కు మెస్సి గుడ్ బై ... ఎందుకో తెలుసుకోండి..!

నీటి విడుదల ప్రారంభమైందో లేదో.. వెలిగొండలో అపశ్రుతి..!

నేపాల్ లో హృదయ విదారకం.. తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

Photos

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)