Breaking News

అమెరికాలోనూ.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు!

Published on Sun, 12/17/2023 - 07:27

యూపీలోని అయోధ్యలో త్వరలో నూతన రామాలయం ప్రారంభంకానుంది. దీనిపై భారతదేశంలోనే కాకుండా యావత్‌ ప్రపంచంలోని  హిందువులలో అమితమైన ఆసక్తి నెలకొంది. ఇదిలావుండగా అమెరికాలోని వాషింగ్టన్‌లో ఆదివారం రామాలయంలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. వాషింగ్టన్‌లోని హిందువులు.. అయోధ్య వే స్ట్రీట్‌లోని ఆంజనేయ ఆలయం వద్ద కారు, బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ వాహనాలపై కాషాయ జెండాలను ఎగురవేశారు. 

అమెరికాలో ఉంటున్న హిందువులు అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులంతా తమ ఇళ్లలో ఐదు దీపాలను వెలిగించాలని నిర్ణయించారు. అలాగే వివిధ నగరాల్లో కారు ర్యాలీలు నిర్వహించనున్నారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిగురించి విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (వీహెచ్‌పీఏ) అధికారి అమితాబ్ మిట్టల్ మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వెయ్యికి పైగా ఆలయాలలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేందుకు అమెరికాలోని హిందువుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌ను ప్రారంభించామని అమితాబ్ మిట్టల్‌ తెలిపారు. అమెరికాలో ఉంటున్న డాక్టర్‌ భరత్ బరాయ్ మాట్లాడుతూ మనందరి కల ఇన్నాళ్లకు సాకారం కాబోతున్నదని అన్నారు. రామ మందిరం కోసం లెక్కలేనంత మంది పోరాడారని, త్వరలో తాము అయోధ్యకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు.
ఇది కూడా చదవండి: నేడు ప్రధాని మోదీ వారణాసి రాక..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)