Breaking News

అమెరికా హెచ్‌1బీ వీసాతో కెనడాలో ఉద్యోగం

Published on Wed, 06/28/2023 - 13:45

టొరొంటొ: అమెరికాలో హెచ్‌1బీ వీసా వినియోగదారులు ఇక కెనడాలో కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఈ మేరకు కెనడా ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మొత్తం 10 వేల మంది ఉద్యోగాలు చేయడం కోసం ఓపెన్‌ వర్క్‌ పరి్మట్‌కు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అమెరికాలో భారతీయ టెక్కీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అమెరికాలో దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఉండడంతో దానిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో కెనడా ఉంది.

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన నిపుణులైన టెక్కీలను ఆకర్షించి సాంకేతిక రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలని చూస్తోంది. ‘‘అమెరికాలో హెచ్‌1బీ వీసా కలిగి ఉన్న వారు 10 వేల మంది వరకు జూలై 16లోగా కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే ఉద్యోగాలు చేయొచ్చు. వారి కుటుంబ సభ్యులు చదువుకోవడం, పని చేయడానికి కూడా అనుమతులిస్తాం’’ అని కెనడా వలసలు, పౌరసత్వ సేవల మంత్రి  సియాన్‌ ఫ్రాజర్‌ చెప్పారు.

తాము ఎన్నో లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామని, దానికి తగ్గట్టుగానే ఇమ్మిగ్రేషన్‌ టెక్‌ టాలెంట్‌ స్ట్రాటజీని అనుసరిస్తున్నట్టుగా చెప్పారు. సాంకేతికంగా వైవిధ్యభరితమైన పురోగతి సాధించి టెక్‌ జెయింట్‌గా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం కింద హెచ్‌1బీ వీసా వినియోగదారులకు మూడేళ్ల పాటు ఓపెన్‌ వర్క్‌ పరి్మట్‌ లభిస్తుంది. వారి జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా చదువుకోవడం వంటివి చేయొచ్చు. అమెరికాలో భారత్, చైనాకు చెందిన వేలాది మంది టెక్కీలను టెక్‌ కంపెనీలు ప్రతీ ఏటా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌ సరిగా లేకపోవడంతో లేఆఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌ నుంచి దాదాపుగా 2 లక్షల మంది టెక్కీలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి వారందరికీ కెనడాలో మంచి అవకాశాలు దొరికే చాన్స్‌ వచి్చంది.   

ఇది కూడా చదవండి: బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి..    
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)