Breaking News

తప్పుడు సమాచారం ఇస్తే వీసాలు రద్దు!

Published on Tue, 02/25/2025 - 06:18

టోరంటో: ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల్లో కెనడా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. నూతన ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ ప్రొటెక్షన్‌ నిబంధనలు ఈ ఏడాది జనవరి 31వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. వీటిద్వారా ఇమ్మిగ్రేషన్, బోర్డర్‌ అథారిటీ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. స్టడీ వీసాలు, వర్క్‌ వీసాలతోపాటు ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్స్‌(ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్‌ వీసాలు(టీఆర్‌వీ) రద్దుచేసే అధికారం దక్కింది.

 వర్క్‌ పర్మిట్లు, స్టడీ పర్మిట్లు సైతం రద్దు చేయొచ్చు. ఈ కొత్త నిబంధనల వల్ల వేలాది మంది విదేశీయులకు నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ప్రధానంగా కెనడాలో ఉంటున్న భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్థులు, టెంపరరీ రెసిడెంట్‌ విజిటర్లకు ఇబ్బందులు ఎదురు కానున్నాయని పేర్కొంటున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నేర చరిత్ర ఉన్నట్లు తేలినా కెనడా అధికారులు వీసాలు రద్దు చేస్తారు. వీసా గడువు ముగిసినా సదరు వీసాదారుడు కెనడా విడిచి వెళ్లే అవకాశం లేదని అధికారులు భావిస్తే వీసా రద్దు కావొచ్చు. 

వీసా పత్రాలను పోగొట్టుకున్నా, చోరీకి గురైనా, ధ్వంసమైనా, తప్పుడు సమాచారంతో ఆ వీసా మంజూరు చేసినట్లు గుర్తించినా.. రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త నిబంధనల వల్ల దాదాపు 7,000 వీసాలు రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కొన్ని రెసిడెంట్‌ వీసాలు, వర్క్‌ పర్మిట్లు, స్టడీ పర్మిట్లపై వేటు తప్పదని అంటున్నారు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు కెనడా వైపు అధికంగా మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం కెనడాలో 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు