Breaking News

సౌదీ కీలక నిర్ణయం.. ఒంటెలకు పాస్‌పోర్టు

Published on Thu, 02/05/2026 - 01:34

సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట నుంచి ఆ దేశంలోని ఒంటెలకు ప్రత్యేక ఫోటోతో కూడిన పాస్‌పోర్టులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచంలో సౌదీ ఒంటెలకున్న ప్రత్యేకతను తెలియజేయడానికే ఈ ప్రత్యేక ప్రాజెక్టుకు చేపట్టనున్నట్లు అక్కడి మంత్రిత్వశాఖ తెలిపింది.

సౌదీ విజన్‌ 2030లో భాగంగా అ‍క్కడి సాంస్కృతిక చిహ్నామైన ఒంటెలకు ప్రత్యేక గుర్తింపు కలిపించనున్నట్లు అక్కడి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గుర్తింపుతో ఆ దేశంలో ఒంటెల పెంపకం రంగం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. ఈ పాస్‌పోర్టులో మైక్రోచిప్ నెంబర్, దాని పేరు, పుట్టిని తేదీ, రంగు, జాతితో పాటు ఆ వివరాలిచ్చిన పశువైద్యుని సంతకం కూడా ఉండనున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

దీనివల్ల ఒంటెలకు సంబంధించిన యజమాన్య హక్కుల విషయంలో వివాదం తలెత్తదని అంతేకాకుండా వాటికి ఆరోగ్యపరమైన విషయాలు తెలుసుకోవడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ చర్యలతో అంతర్జాతీయ మార్కెట్‌లో సౌదీ ఒంటెలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అక్కడి మంత్రిత్వ శాఖ తెలిపింది.  

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)