Breaking News

రియల్‌ హీరో వీడియో వైరల్‌.. ఊహించని ట్విస్ట్‌

Published on Fri, 05/12/2023 - 17:27

పరోపకారిగా బతికే మనుషులు.. ఈరోజుల్లో కనిపించడం అరుదైపోయింది. కొందరు తాము చేసింది చిన్నసాయంగానే ఫీలైనప్పటికీ..  అవతలి వాళ్లు మాత్రం దానిని విలువైందిగా భావించొచ్చు.  అలా ఓ పసిప్రాణాన్ని కాపాడిన వ్యక్తి అదేమంత పెద్దసాయం కాదని అంటుంటే.. ఊహించని ప్రతిఫలం, అదీ ఎంతోకాలంగా అతను ఎదురుచూస్తుందే దక్కింది ఇప్పుడు.. 

కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి ఓ పసికందును   కాపాడిన వీడియో గత కొన్నిరోజులుగా వైరల్‌ అవుతోంది.  ఆ వీడియోలో.. ఒక పెద్దావిడ ఓ చిన్నారిని స్ట్రోలర్‌లో పెట్టుకుని తీసుకెళ్లే యత్నం చేస్తుంది. ఆ టైంలో ఆమె కారులో ఏదో సర్దుతుంటే.. గాలి బలంగా వీయడంతో ఆ స్ట్రోలర్‌ దానంతట అదే వాహనాలు తిరుగుతున్న  రోడ్డు వైపుగా వెళ్తుంటుంది. ఆమె అప్రమత్తమయ్యేలోపు కిందపడిపోగా.. ఓ వ్యక్తి ఆపద్బాంధవుడిలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్నారిని రోడ్డు మీదకు వెళ్లకుండా రక్షించాడు. 

కట్‌ చేస్తే.. ఆ వ్యక్తి చేసిన సాహసానికి ఇప్పుడు నజరానా లభించింది. అదేంటో కాదు.. అతనికి ఉద్యోగం!. ఆ ఘటనకు ముందు ఆపిల్‌బీ అనే రెస్టారెంట్‌  ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడతను. అది అయిపోయి బయటకు రాగానే.. ఈ ఘటన జరిగింది.  అయితే.. ఆ వ్యక్తి సాహసం వైరల్‌ కావడంతో.. ఆ కంపెనీ వాళ్లు అతన్ని పిలిచి మరీ తమ ఫ్రాంచైజీల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇచ్చారట. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.

ఆ వ్యక్తి పేరు రోన్‌ నెస్‌మ్యాన్‌. సొంతిల్లు లేదు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గత ఎనిమిది నెలల నుంచి దగ్గరి బంధువు ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్‌ ఇంటర్వ్యూకు వెళ్లిన అతనికి.. ఆపదలో ఉన్న చిన్నారి కంటపడింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను రక్షించి.. రియల్‌ హీరోగా అందరితో ప్రశంసలు అందుకున్నాడు. ఆ క్షణం ఆ పెద్దావిడ భయంతో వణికిపోతుంటే.. ఆమెను కౌగిలించుకుని ధైర్యం చెప్పి ఓదర్చాడట ఈ రియల్‌ హీరో. 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)