Breaking News

బస్సు బోల్తా.. 16 మంది మృతి

Published on Tue, 12/23/2025 - 09:30

జకార్తా: ఇండోనేసియాలోని ప్రధాన దీవి జావాలో జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున సెమరంగ్‌ నగరంలోని క్రప్యక్‌ టోల్‌ ప్లాజా సమీపంలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఇండోనేషియాలో పురాతన నగరం యోగ్యకర్త నుంచి రాజధాని జకార్తాకు వస్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 34 మంది ప్రయాణికులున్నారు. వేగంగా వస్తున్న బస్సు మలుపులో అదుపుతప్పి కాంక్రీట్‌ గోడను ఢీకొని, పల్తీ కొట్టింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దాదాపు 40 నిమిషాలకు పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ప్రమాద తీవ్రతకు నుజ్జయిన బస్సులో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో 10 మంది తుదిశ్వాస విడిచారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగాను, మరో 13 మంది ఆందోళనకరంగాను ఉందని పోలీసులు తెలిపారు. బస్సును నడుపుతున్న అసిస్టెంట్‌ డ్రైవర్‌ కూడా క్షతగాత్రుల్లో ఉన్నాడు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)