Breaking News

ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృతి

Published on Sun, 03/02/2025 - 07:15

బొలివియా: బొలివియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 37 మంది ప్రయాణీకులు మృతిచెందారు. అలాగే, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంపై బొలివియా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బొలివియాలోని ఉయుని సమీపంలో బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 37 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. అయితే, లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఉత్సావాల్లో ఒకటైన ప్రఖాత ఒరురో కార్నివాల్‌కు బస్సులు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందం చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఒక బస్సు డ్రైవర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరికి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)