Breaking News

Bruce Lee Workout Plan: ఇదే బ్రూస్‌ లీ జిమ్‌ వర్క్‌అవుట్‌ ప్లాన్‌..

Published on Mon, 07/03/2023 - 09:27

బ్రూస్‌ లీ.. ఈ పేరు విననివారు ఎవరూ ఉండరు. మార్షల్‌ ఆర్ట్స్‌ అనగానే ‍ఎవరికైనా టక్కున బ్రూస్‌ లీ పేరు గుర్తుకు వస్తుంది. మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకూ బ్రూస్‌లీ పేరును పడగొట్టే మొనగాడెవడూ లేడంటే అతిశయోక్తి కాదు. 

ఇంటర్నెట్‌లో బ్రూస్‌ లీ గురించి వెదుకులాట..
తన 32 ఏళ్ల జీవితంలో బ్రూస్‌ లీ అద్భుత ప్రతిభతలో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా బ్రూస్‌ లీని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తుంది. బ్రూస్‌ లీ 1940లో ఫ్రాన్సిస్కోలో జన్మించారు. నేటి కాలంలోనూ ఇంటర్నెట్‌లో బ్రూస్‌ లీకి సంబంధించిన అనేక విషయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే లెక్కకు మించిన నెటిజన్లు తరచూ బ్రూస్‌ లీ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తుంటారు. ఇటీవల బ్రూస్‌ లీకి సంబంధించిన 1965 నాటి వర్క్‌అవుట్‌ ప్లాన్‌ వైరల్‌గా మారింది.

బ్రూస్‌ లీ వర్క్‌అవుట్‌ ఇలా..
బ్రూస్‌ లీ వర్క్‌అవుట్‌ ప్లాన్‌ కెవుంగ్‌ జిమ్నాషియంతో ముడిపడివుంది. దీనిలో అతను ఏ వర్క్‌అవుట్‌ ఎన్నిసార్లు, ఎంతసేపు చేసేవాడనే వివరాలు ఉన్నాయి. ఈ వర్క్‌అవుట్‌ ప్లాన్‌ చూసినవారు ఈ రొటీన్‌ను ఫాలో చేయడం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. ట్వీట్‌ చేసిన ఈ పోస్టులో బ్రూస్‌ లీకి సంబంధించిన ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో కనిపిస్తోంది. అతని ట్రైనింగ్‌ ‍ప్రోగ్రాం వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాలలో కనిపిస్తోంది.

ఈ ప్లాన్‌ చూసిన వారంతా..
ట్విట్టర్‌పై ఈ పోస్టును ‘వరల్డ్‌ ఆఫ్‌ హిస్టరీ’(@UmarBzv) పేరు గల పేజీలో షేర్‌ చేశారు. దానికి 1965లో బ్రూస్‌ లీ ఎర్లీ ట్రైనింగ్‌ ప్లాన్‌ అనే కామెంట్‌ రాశారు. ఈ పోస్టుకు 8 మిలియన్లకుపైగా వ్యూస్‌ దక్కాయి. 70 వేలకుపైగా లైక్స్‌ పడ్డాయి. ఈ వర్క్అవుట్‌ ప్లాన్‌ చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతూ, దీనిని ఫాలో చేయడం అసాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్‌.. బ్రూస్‌ లీ వర్క్‌అవుట్‌ ప్లాన్‌ను పరిశీలించి ఈ ప్లాన్‌ పూర్తి చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని లెక్కవేశారు.

ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్‌ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే..

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్