Breaking News

Brothers Day: నాన్న తరువాత..

Published on Sat, 05/24/2025 - 09:08

ప్రేమికుల దినోత్సవం, స్నేహితులు దినోత్సవం మాదిరిగానే అన్నదమ్ముల దినోత్సవం(Brother's Day) ఉందనే సంగతి మీకు తెలుసా? అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ములే ఇంటిని చక్కదిద్దేవారుగా నిలుస్తుంటారు. వీరి అనుబంధం చక్కగా ఉన్నప్పుడే వారి కుటుంబానికి సమాజంలో మంచిపేరు వస్తుంది. ఈ రోజు మే 24.. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజుకున్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

భారతదేశంలో అనుబంధాలకు ఎంతో ప్రాముఖ్యత కనిపిస్తుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు ‍ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అన్న, తమ్ముడు ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తుంటారు. అన్నదమ్ముల దినోత్సవాన్ని తొలుత తొలుత అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, సి డేనియల్ రోడ్స్ జరుపుకున్నారని చెబుతారు. 2005 నుంచి ప్రతి సంవత్సరం మే 24న ఈ బ్రదర్స్ డేని  చేసుకుంటున్నారు.  మొదట్లో దీనిని అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. తర్వాత ప్రపంచమంతటా జరుపుకోవడం ప్రారంభించారు. కొన్ని దేశాలలో అయితే ఈ రోజున అధికారిక సెలవుదినం(Holiday)గానూ ప్రకటించారు.

అన్న అంటే ఓ బాధ్యత. నాన్న తర్వాత  ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది ఆయనే. అదే విధంగా తమ్ముడు కూడా బాధ్యతగానే మెలుగుతాడు. ఇక అమ్మాయిలైతే తమ బ్రదర్స్‌ను తమకు సెక్యూరిటీ కల్పించేవారిగా భావిస్తుంటారు. రక్త సంబంధం లేకపోయినా ఆత్మీయంగా ఇతరులను సోదర భావంతో చూసుకునే ప్రత్యేకమైన రోజు ఇది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తమ ప్రియమైన సోదరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈరోజున తమ  అన్నదమ్ములకు నచ్చిన వంటకాలను చేయడంతో పాటు వారికి నచ్చిన వస్తువులను కానుకలుగా  అందజేస్తుంటారు. కొన్ని దేశాల్లో అన్నదమ్ముల దినోత్సవం  నాడు సోదరులతో రోజంతా సరదాగా గడపడం, వారితో కలిసి టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లడంలాంటివి చేస్తుంటారు.

ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)