Breaking News

బ్రిటిష్ రాయల్ నేవీలో తొలి హిందూ గురువుగా భాను అత్రి

Published on Wed, 08/20/2025 - 12:59

లండన్: బ్రిటిష్ రాయల్ నేవీ తొలిసారిగా హిందూ గురువును నియమించింది. హిందూ ధర్మ సిద్ధాంతాల ద్వారా నావికా సిబ్బందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేసేందుకు ఈ నియామకం చేపట్టారు.  క్రైస్తవుడు కాని వ్యక్తిని ఈ విధంగా ఎంపిక చేసిన తొలి సందర్భం ఇది. బ్రిటిష్ రాయల్ నేవీలో నియమితులైన 148 మంది కొత్త అధికారులలో భాను అత్రి  ఒకరు.

భాను అత్రి (39) భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు. ప్రస్తుతం బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో నివసిస్తున్నారు. లండన్‌లో ఒక ఆలయ నిర్వహణలో ఆయనకు దీర్ఘకాల అనుభవం ఉంది. భాను అత్రి తాజా నియామకం కోసం ఆరు వారాల అధికారిక శిక్షణ పొందారు. ఇందులో భాగంగా నాలుగు వారాల యుద్ధనౌక హెచ్‌ఎంఎస్‌ ఐరన్ డ్యూక్‌లో సముద్ర మనుగడ శిక్షణ, మూడు వారాలపాటు  హిందూ గురువుగా శిక్షణ పొందారు తాను నౌకాదళంలో మొదటి హిందూ గురువుగా ఎంపిక కావడం కావడం ఆనందంగా ఉందని అత్రి అన్నారు.
 

భాను అత్రిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు అభినందించారు. బ్రిటన్ రాయల్ నేవీలో హిందూ గురువుగా ఎంపికైనందుకు భాను అత్రికి సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భాను అత్రి హిమాచల్‌తో పాటు దేశం గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  1986 సెప్టెంబర్‌లో జన్మించిన భాను అత్రి.. నల్వాలోని సరస్వతి నికేతన్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత, సోలన్‌లోని సంస్కృత కళాశాల నుండి శాస్త్రి విద్యను పూర్తి చేసి, ఢిల్లీలో జ్యోతిష్య పట్టా పొందారు. 2009లో లండన్‌ చేరుకున్న అత్రి  అక్కడ ఆలయ పూజారిగా బాధ్యతలు చేపట్టారు. భాను అత్రి తండ్రి రామ్ గోపాల్ అత్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు. భాను అత్రి తల్లి లీనా అత్రి గృహిణి. భాను అత్రి తన భార్య, పిల్లలతో పాటు లండన్‌లో ఉంటున్నారు. 
 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)