Breaking News

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్నారా... ఏఐ కెమెరా పట్టేస్తుంది!

Published on Tue, 12/17/2024 - 04:21

మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా? ‘రోడ్డు మీద పోలీసుల్లేరు కదా, మనం సేఫ్‌’అనుకోవడానికి ఇకపై వీల్లేదు. ఎందుకంటే తాగి, లేదా డ్రగ్స్‌ తీసుకుని వాహనం నడిపే వారిని కదలికలను బట్టి పసిగట్టే కృత్రిమ మేధతో కూడిన కెమెరా వచ్చేసింది. ఇకపై పోలీసులు ప్రతి వాహనాన్నీ ఆపి డ్రైవర్‌ను చెక్‌ చేయాల్సిన పని లేదు. ఈ ఏకై కెమెరాలు డ్రైవర్‌ స్థితి ఏమిటన్నది గుర్తించి పోలీసులకు సమాచారమిస్తాయి. వాళ్లు వెంటనే వాహనాన్ని ఆపి డ్రైవర్‌ను చెక్‌ చేస్తారు. 

తాగి నడిపేవారిని పట్టుకోవడానికి ఏఐ సాయంతో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కెమెరా ఇది. అత్యాధునిక హెడ్సప్‌ పరికరంతో తయారు చేసిన ఈ కెమెరాలను బ్రిటన్‌ పోలీసులు ప్రయోగాత్మకంగా వాడి చూస్తున్నారు. ఈ కెమెరాలు డ్రైవర్లకు కనిపించవు. వీటిని అక్యూసెన్సస్‌ అనే సంస్థ తయారు చేసింది. వాహనాలు నడుపుతూ మొబైల్‌ ఫోన్లు వాడే, సీటు బెల్టు పెట్టుకోని డ్రైవర్లను పట్టుకోవడానికి గతంలో పోలీసులు ఈ సంస్థ కెమెరాల ను వాడారు. 

మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి ఆస్కారం ఆరు రెట్లు ఎక్కువ. అలాంటివారిని ముందే గుర్తించగలిగితే అనేక ప్రాణాలు కాపాడొచ్చనేది అక్యూసెన్సస్‌ మోటో. కానీ పోలీసులు అంతటా కాపలా కాయలేరు. ‘‘కనుక ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి. ప్రమాదాలను తగ్గించడానికి చేపడుతున్న చర్యల్లో ఇదో భాగం’’అంటున్నారు బ్రిటన్‌ పోలీసులు. 
   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)