ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్‌ కౌంటర్‌

Published on Sat, 01/04/2025 - 11:38

లండన్‌:బ్రిటన్‌(Britain) ప్రధాని కీర్‌ స్టార్మర్‌(Keir Starmer)పై అమెరికా బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌(Elon Musk) విమర్శలకు బ్రిటన్‌ ప్రభుత్వం గట్టి కౌంటర్‌ ఇచ్చింది. పాకిస్తాన్‌(Pakistan) మూలాలున్న వ్యక్తులు అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లను నడిపినా అప్పట్లో క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ హెడ్‌గా ఉన్న స్టార్మర్‌ పట్టించుకోలేదని మస్క్‌ విమర్శలు గుప్పించారు.  ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)వేదికగా మస్క్‌ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి.

అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగులను చట్టం ముందు దోషులుగా నిలపడంలో స్టార్మర్‌ అప్పట్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇందుకే బ్రిటన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో స్టార్మర్‌కు కూడా భాగస్వామ్యం ఉందని మస్క్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆ గ్యాంగులపై విచారణకు లేబర్‌ పార్టీ ఒప్పుకోనందున ఆ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు. 

అయితే ఈ మస్క్‌ చేసిన ఈ విమర్శలపై యూకే ఆరోగ్య శాఖ మంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌ తప్పుపట్టారు. మస్క్‌కు ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని,ఆయన ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయని వెస్‌ పేర్కొన్నారు. అయితే బ్రిటన్‌లో అమ్మాయిలపై అకృత్యాలను అరికట్టేందుకు మస్క్‌తో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు.

ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..?

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)