Breaking News

భారత్‌తో భాగస్వామ్యం.. వైఖరి మార్చుకున్న బ్రిటన్‌ ప్రధాని!

Published on Sat, 07/06/2024 - 12:08

లండన్‌: బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రిగా లేబర్‌ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఎన్నిక అయ్యారు. అయితే గతంలో లేబర్ పార్టీ కశ్మీర్‌ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేయటంతో భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా లేబర్‌ పార్టీ అధికారంలోకి రావటంతో భారత్‌తో భాగస్వాయం విషయం తెరపైకి వచ్చింది. అయితే లేబర్‌ పార్టీ గతంలో భారత్‌పై చేసిన ఆరోపణలు, వైఖరిని ప్రధాని కీర్ స్టార్మర్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.

2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ వార్షిక సమావేశంలో భారత్‌లోని కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుందని, అక్కడి పరిస్థితిపై ఎమర్జెన్సీ తీర్మానం ప్రవేశపెట్టారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేమయంలో లేబర్‌ పార్టీ చేసిన ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. 

లేబర్‌ పార్టీ ఆరోపణలు సరైన సమాచారం లేని, నిరాధారమైనవి అని భారత్‌ మండిపడింది. అప్పట్లో జెరెమీ కార్బిన్‌పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత సంతతి ఎంపీలు వ్యతిరేకించారు. జెరెమీపై చేసిన తీర్మానం భారత వ్యతిరేక విధానమని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక..2020లో కొన్ని కారణాల వల్ల ఆయన్ను లేబర్ పార్టీ సస్పెండ్‌ చేసింది.

అయితే కొత్తగా ఎన్నికైన ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌తో భాగస్యామ్యం, సంబంధాల విషయంలో తన పార్టీ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకుంటామని తెలిపారు. గతంలో చేసిన ఆరోపణలపై తమ పార్టీ వైఖరీ మార్చుకుంటామని పేర్కొన్నారు.  భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్దతతో ఉన్నట్లు తెలిపారు. 

‘‘ లేబర్ పార్టీ ఇతర దేశాలతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాలను మెరుగుపర్చుకుంటుంది. స్వేచ్ఛా వాణిజ్యం, భద్రత, విద్య, టెక్నాలజీ, పర్యావరణ మార్పులు వంటి పలు రంగాల్లో మేము భారత్‌ కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం’’ అని మేనిఫోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో లేబర్‌ పార్టీ తన భారత వ్యతిరేక వైఖరిని మార్చుకొని భాగస్వామ్య సంబంధాలు పెంచుకునే దిశగా వెళ్లుతున్నట్లు స్పష్టం అవుతోంది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)