Breaking News

ఉమ్మడి భద్రత కోసం పనిచేయాలి: జిన్‌పింగ్‌

Published on Fri, 10/25/2024 - 04:52

కజన్‌: గ్లోబల్‌ సౌత్‌ దేశాలు కలిసికట్టుగా ఆధునికత దిశగా ముందుకు సాగుతుండడం ప్రపంచ చరిత్రలో, మానవ నాగరికతలో అపూర్వమైన ఘట్టమని చైనా అధినేత జిన్‌పింగ్‌ ప్రశంసించారు. శాంతి, ఉమ్మడి భద్రత కోసం బ్రిక్స్‌ ప్లస్‌ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన బ్రిక్స్‌ ఔట్‌రీచ్‌ సదస్సులో ప్రసంగించారు. 

బ్రిక్స్‌ప్లస్‌ దేశాల శాంతి ప్రపంచ శాంతితో ముడిపడి ఉందన్నారు. ఉమ్మడి ప్రగతి కోసం ఆయా దేశాలన్నీ స్వయంగా చోదక శక్తిగా మారాలని సూచించారు. దేశాల మధ్య సమాచార మారి్పడి, సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గ్లోబల్‌ సౌత్‌ను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటామని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. తమ మూలాలను మర్చిపోవడం లేదన్నారు. 

ముగిసిన బ్రిక్స్‌ సదస్సు 
రష్యాలో మూడు రోజులపాటు జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. బ్రిక్స్‌ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు కాగా, కొత్తగా ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. కూటమిలో సభ్యత్వం కోసం తుర్కియే, అజర్‌బైజాన్, మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు సైతం బ్రిక్స్‌లో చేరడానికి ఆసక్తి ప్రదర్శించాయి. ముగింపు సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రసంగించారు. రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సాగించిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. ప్రపంచంలో బ్రిక్స్‌ పాత్రను పశి్చమ దేశాలకు ప్రత్యామ్నాయంగా అభివరి్ణంచారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)