Breaking News

సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు!

Published on Mon, 08/21/2023 - 14:00

బ్రెజిల్‌లోని ఓ కుటుంబం అందరినీ హడలెత్తించే విషయాన్ని వెల్లడించింది. తమ బంధువు అయిన 37 ఏళ్ల రోసంగెలా అల్మెయిడా సజీవంగా సమాధి అయ్యిందని తెలిపారు. ఆమె 11 రోజుల పాటు సమాధిలో ఉన్న శవపేటిక నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. బయటపడేందుకు ఆమె పెద్దపెట్టున అరిచేది. శవపేటికను లోపలి నుంచి కాళ్లతో బలంగా తన్నేది. లోపలి నుంచి వస్తున్న శబ్ధాలకు భయపడి ఆ దరిదాపులకు ఎవరూ వెళ్లలేదు. చివరకు ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా, చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది.

మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం రోసంగెలా అల్మెయిడా సెప్టిక్ షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధృవీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది. రోసంగెలా అల్మెయిడాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమె 11 రోజుల పాటు శవపేటికలోంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడింది. అల్మేడా ఖననం అయిన సమాధి నుండి వింత శబ్ధాలు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. 

స్మశానవాటికకు వచ్చేవారు సమాధి నుండి ఎవరివో మూలుగులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు చేరుకుని సమాధిని తవ్వారు. రోసంగెలా అల్మెయిడాను సమాధి నుండి బయటకు తీసినప్పుడు, శవపేటికలో రక్తం కనిపించింది. ఆమె మణికట్టు, నుదిటిపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఖననం చేసే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్మేడా శరీరం వెచ్చగా ఉండని డిగ్గర్లు తెలిపారు. దీంతో ఆమె చనిపోయి ఎక్కువ కాలం గడచివుండకపోవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె సమాధి నుంచి బయటపడేందుకు పెనుగులాడి, చివరకు మృతి చెందివుంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులను కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్నవారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. రోసాంగిల్‌ స్పృహతప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆసమయంలో ఆమె చనిపోయినట్లు పొరపడి ఖననం చేశారు. 
ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. 

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)