Breaking News

బ్రెజిల్ అల్లర్లు.. గవర్నర్‌ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు..

Published on Mon, 01/09/2023 - 17:54

బ్రెజీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు ఆదివారం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 3,000 మంది పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ప్యాలెస్‌పై దాడి చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. 

అయితే భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. దీంతో బ్రెజీలియా గవర్నర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడు నెలల పాటు అతన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.

రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రెజిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అల్లరిమూకలు దేశ రాజధానిలో హింసకు పాల్పడ్డాయని విమర్శించారు.

రాజధానిలో భద్రతా వైఫల్యానికి బోల్సోనారోనే కారణమని లూలా ఆరోపించారు. ఫెడరల్ సెక్యూరిటీ జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.  విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, మతోన్మాద స్టాలిన్లు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొన్నారు.

గతేడాది జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో పార్టీపై స్వల్ప సీట్ల తేడాతో గెలిచారు లూలా. అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే బోల్సోనారో ఈయన విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి రాజధానిలో బ్రెజీలియాలో ఆదివారం విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు.
చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)