Breaking News

బొల్సనారో ముందే అరెస్ట్‌ 

Published on Sun, 11/23/2025 - 05:33

సావొ పౌలొ: దేశంలో తిరుగుబాటు లేవదీసేందుకు ప్రయత్నించిన ఆరోపణలపై గృహ నిర్బంధంలో ఉన్న బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జయిర్‌ బొల్సనారోను అధికారులు ముందుగానే అరెస్ట్‌ చేశారు. మరో రెండు వారాల్లో ఆయనపై విధించిన 27 ఏళ్ల కారాగార శిక్ష అమల్లోకి రానుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. 2019–2022 సంవత్సరాల మధ్య దేశాధ్యక్షుడిగా ఉన్న బొల్సనారో.. 2022 ఎన్నికల్లో లులా డసిల్వా చేతిలో ఓటమి పాలయ్యారు. 

అనంతరం, 2023లో దేశంలో తిరుగుబాటుకు, అధ్యక్షుడు లులా డ సిల్వా హత్యకు కుట్ర పన్నారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బొల్సనారోకు 27 ఏళ్ల కారాగారంతోపాటు 2030 వరకు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనరాదంటూ నిషేధం విధించింది. ప్రస్తుతం ఆయన విలాసవంతమైన జర్దిప్‌ బొటనాకో ప్రాంతంలోని సొంతింట్లో గృహ నిర్బంధంలో ఉన్నారు. 

కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచేందుకు ఎల్రక్టానిక్‌ మానిటర్‌ను జూలై 18వ తేదీన ఆయన కాలికి అమర్చారు. శనివారం వేకువజామున ఆ పరికరాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని ప్రకటించిన సుప్రీంకోర్టు జడ్జి అలెగ్జాండర్‌ డి మోరెస్‌..బొల్సనారోను వెంటనే గృహ నిర్బంధం నుంచి రాజధాని బ్రెసిలియాలో ఫెడరల్‌ పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలివ్వడం కలకలం రేపింది.

 బొల్సనారో దేశాన్ని విడిచి దొంగచాటుగా పరారయ్యే ప్రమాదముందని, నివాసం పొరుగునున్న రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం కోరే అవకాశముందని అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ఇదంతా ముందు జాగ్రత్త మాత్రమేనని, మాజీ అధ్యక్షుడిని అవమానించే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆయనకు బేడీలు వేయడం, బహిరంగంగా జైలుకు తరలించడం వంటివి చేపట్టబోమన్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)