Breaking News

నదిలో లైవ్‌ రిపోర్టింగ్‌.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో

Published on Tue, 07/22/2025 - 13:39

నిజంగానే.. ఆ న్యూస్‌ రిపోర్టర్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఘటనే ఇది. ఓ బాలిక మిస్సింగ్‌ కేసులో లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తుండగా భయానక అనుభవం ఎదురైంది అతనికి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటకు చేరింది. 

బ్రెజిల్‌లోని బాకబాల్ రీజియన్‌ మారాన్యో ప్రాంతంలో రయిస్సా అనే 13 ఏళ్ల బాలిక జూన్‌ 30వ తేదీన అదృశ్యమైంది. మియరిమ్‌ నదిలో స్నేహితులతో ఈతకు వెళ్లి కొట్టుకుపోయింది. గత ఈతగాళ్లు ఎంత గాలించిన ఫలితం లేకుండా పోయింది. అయితే పోలీసులు మాత్రం మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని ఆమె ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈలోపు.. 

టీవీ రిపోర్టర్ లెనిల్డో ఫ్రాజావో నీళ్లలోకి దిగి బాలిక మిస్సింగ్‌ కేసు వార్తకు సంబంధించి రిపోర్టింగ్‌ చేస్తూ కనిపించాడు. ఇంతలో అతని కాళ్లకు ఏదో తాకింది. తీరా చూస్తే అది ఆ బాలిక మృతదేహం!!. దీంతో ఒక్కసారిగా వణికిపోయిన అతను.. ఇక్కడేదో తాకుతుందంటూ తన టీంనుఅప్రమత్తం చేసే ప్రయత్నం చేశాడు. మళ్లీ లోపలకు వెళ్లను.. అక్కడేదో తాకుతోంది. బహుశా చెయ్యి అనుకుంటా అంటూ వణికిపోతున్న గొంతుతో చెప్పాడు.

వెంటనే ఆ బృందం పోలీసులకు సమాచారం అందించింది. వాళ్లు ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. నీట మునిగే ఆమె చనిపోయిందని.. బహుశా ఆ మృతదేహం నది అడుగుభాగంలోని మట్టిలో ఇంతకాలం కూరుకుపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆ రిపోర్టర్‌కు భయానక అనుభవం మిగిల్చిన వీడియో కిందే ఉంది! చూసేయండి.. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు