Breaking News

బీఆర్‌ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్‌

Published on Wed, 10/30/2024 - 09:56

బీజింగ్ : చైనాకు బ్రెజిల్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రణాళికకు బ్రెజిల్ అడ్డుకట్టవేసింది.  చైనా చేపట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేరకూడదని నిర్ణయించుకుంది. తద్వారా ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వని బ్రిక్స్ గ్రూపులోని రెండో దేశంగా బ్రెజిల్‌ అవతరించింది.

బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ మీడియాతో మాట్లాడుతూ బ్రెజిల్ బీర్‌ఐలో చేరదని, అయితే ఇందుకు బదులుగా చైనా పెట్టుబడిదారులతో భాగస్వామిగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. బ్రెజిల్  ఎటువంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా, చైనాతో తన సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటోందన్నారు.

హాంకాంగ్‌కు చెందిన వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'లోని వార్తల ప్రకారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించిన చైనా ప్రణాళికకు బ్రెజిల్  మద్దతునివ్వడం లేదు. బ్రెజిల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చైనా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్‌ఐ ప్రాజక్టు అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు విరుద్ధమని భారత్‌ పేర్కొంది.

ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్‌- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)