Breaking News

స్వయం ‍ప్రకటిత బౌద్ధ గురువు బమ్జాన్‌కు పదేళ్ల జైలు

Published on Tue, 07/02/2024 - 08:13

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నేపాల్‌కు చెందిన స్వయం ప్రకటిత బౌద్ధ గురువు రామ్ బహదూర్ బమ్జాన్‌కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పునిచ్చిన సర్లాహి జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవన్ కుమార్ భండారీ నిందితునికి జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు.

వివరాల్లోకి వెళితే బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ కేసులో బమ్జాన్‌ సహచరులు జీత్ బహదూర్ తమాంగ్, జ్ఞాన్ బహదూర్ బమ్జాన్‌లు నిర్దోషులుగా విడుదలయ్యారు. బమ్జాన్‌ ప్రస్తుతం జలేశ్వర్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 2024, జనవరి 9న ఖాట్మండులోని బుధ్‌ నీటకంఠలో నేపాల్‌ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం బమ్జాన్‌ను అరెస్టు చేసింది.

2020 ఫిబ్రవరి 6న సర్లాహి జిల్లా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత బమ్జాన్‌ పరారయ్యాడు. 2016, ఆగస్టు 4న  అతని ఆశ్రమంలో అనీ (నన్‌)గా ఉంటున్న 15 ఏళ్ల బాలిక.. బమ్జాన్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2020 ఫిబ్రవరి 23న బాధితురాలు తనకు మైనారిటీ వచ్చిన వచ్చిన తరువాత బమ్జాన్‌పై పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా మరికొందరు బమ్జాన్‌పై హత్య, కిడ్నాప్, లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 2005లో ఆహారం, నీరు, నిద్ర లేకుండా ధ్యానం చేసిన కారణంగా బమ్జాన్‌ వెలుగులోకి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతనికి బుద్ధ బాయ్ అనే పేరు వచ్చింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)