Breaking News

ఆ నీలి కళ్ల చాయ్‌వాలా.. మోడలింగ్‌ తర్వాత లండన్‌లో మొదలెడుతున్న పని ఇదే..

Published on Wed, 07/19/2023 - 11:56

తన ప్రత్యేకమైన నీలి కళ్లతో జనం మనసులు దోచుకున్న ఆ పాకిస్తాన్‌ చాయ్‌వాలాను ఎవరూ మరచిపోలేరు. ఇంటర్నెట్‌లో తన ఫొటోతో అందరినీ కట్టిపడేసిన ఆ కుర్రాడి పేరు అర్షద్‌ ఖాన్‌. ఫొటోగ్రాఫర్‌ జియా అలీ తన కెమెరాతో అర్షద్‌కు ఫొటో తీసి, దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అప్పట్లో ఈ ఫొటో సంచలనాలు నమోదు చేసింది. ఈ ఒక్క ఫొటోతో అతని జీవితమే మారిపోయింది. ఇక జీవితంలో దేనికీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అర్షద్‌కు ఏర్పడలేదు. 

ఈ నేపధ్యంలో 2020లో అర్షద్‌ పాక్‌లోని ఇస్లామాబాద్‌లో సొంతంగా టీ కెఫే ప్రారంభించారు. ఆ తరువాత రెండు కెఫేలను లాహోర్‌లో ఒక కెఫెను మురీలో తెరిచారు. తాజాగా అర్షద్‌ ఏకంగా లండన్‌లో ఒక కెఫె ప్రారంభించనున్నారు. మీడియాతో అర్షద్‌ మాట్లాడుతూ ‘నా లండన్‌ ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నన్ను అభిమానించేవారి కోసం టీ తయారుచేయడాన్ని నేను ఇష్టపడతాను. లండన్‌ రావాలంటూ నాకు రిక్వెస్ట్‌ వచ్చింది. నా తొలి అంతర్జాతీయ టీ దుకాణం లండన్‌లోని ఇల్ఫోయీ లేన్‌లో ప్రారంభం కానుంది. ఇల్ఫోయి లేన్‌లో పెద్ద సంఖ్యలో పాకిస్తానీయులు, భారతీయుల ఇళ్లు ఉన్నాయి. వారంతా చాయ్‌ని అమితంగా ఇష్టపడతారు’ అని తెలిపారు. 

లండన్‌లో ప్రారంభించే కెఫే కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షద్‌ chaiwalauk_ak పేరుతో ఒక అకౌంట్‌ తెరిచారు. దీనిలో తన కెఫేకు సంబంధించిన అప్డేట్‌ అందిస్తున్నారు. అర్షద్‌ తొలి ఫొటో వైరల్‌ అయినప్పుడు అతనికి మోడలింగ్‌లో అనేక అవకాశాలు లభించాయి. యూకే బేస్డ్ కంపెనీకి అర్షద్‌ మోడలింగ్‌ చేశారు. ఇప్పుడు అర్షద్‌ లండన్‌లో తన నూతన టీ దుకాణం ప్రారంభంతో మరోమారు చర్చల్లో నిలిచారు.
ఇది కూడా చదవండి: ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్‌!

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)