కాలిఫోర్నియాలో బర్డ్‌ ఫ్లూ భయం.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి

Published on Sun, 01/28/2024 - 11:08

కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాను బర్డ్‌ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి అక్కడి పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియా కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్‌డౌన్‌ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో అవి ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. 

అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్‌ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలున్నాయి. 

మనుషుల్లో హెచ్‌7ఎన్‌9,హెచ్‌5ఎన్‌1 వైరస్‌ రకాలు బర్డ్‌ ఫ్లూ వ్యాధికి కారణం అవుతాయి. సాధారణంగా పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ బయటికి విడుదలవుతుంది. ఈ వైరస్‌ గాలిలో ఉన్నపుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్‌ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్లు, ముక్కు, నోరు తాకినపుడు  వైరస్‌ మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. 

బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకుండా  కేవలం స్వల్ప అనారోగ్యం మాత్రమే ఉంటుంది. మరికొన్ని కేసుల్లో కళ్లు ఎరుపెక్కడం, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. 

బర్డ్‌ ఫ్లూ సోకిన వారు లక్షణాలను గమనించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉం‍టుంది. వ్యాధి తీవ్రతను బట్టి హోమ్‌ లేదా హాస్పిటల్‌ ఐసోలేషన్‌లో ఉండాలి. శరీరంలో వైరస్‌ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స తీసుకుంటునే ఉండాలి. 

ఇదీచదవండి.. క్రూయిజ్‌ క్షిపణులు పేల్చిన నార్త్‌ కొరియా 

Videos

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)