Breaking News

భారత్‌ ఒక ప్రయోగశాల

Published on Wed, 12/04/2024 - 05:10

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ యథాలాపంగా చెప్పిన ఒక వాక్యం వివాదాస్పదమైంది. తరచూ భారత్‌ను పొగిడే బిల్‌గేట్స్‌ ఒక్కసారిగా భారత్‌ను ప్రయోగశాలతో పోల్చడమేంటని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రీడ్‌ హాఫ్‌మన్‌తో నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌ చర్చావేదికలో భారత ప్రస్థానాన్ని బిల్‌గేట్స్‌ ప్రస్తావించారు. ‘‘ జనాభాపరంగా అతిపెద్దదైన భారత్‌లోనూ ఆరోగ్యం, పోషకాహారం, విద్యారంగాలు అభివృద్ధిబాటలో పయనిస్తున్నాయి.

భారతీయులు సుస్థిరాభివృద్ధిని మాత్రమేకాదు సుస్థిర ప్రభుత్వా దాయాలను సమకూర్చుకుంటున్నారు. వచ్చే 20 ఏళ్లలో అక్కడి ప్రజలు మరింత పురోభివృద్దిని సాధించగలరు. భారత్‌ వెలుపల కంటే భారత్‌లో తమను తాము నిరూపించుకునేందుకు ఆ దేశం నిజంగా ఒక ప్రయోగశాల. అమెరికా వెలుపల మా అతిపెద్ద కార్యాలయం భారత్‌లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడా పైలట్‌ ప్రాజెక్టులు మేం చేపట్టినా మా భాగస్వాములు మాత్రం ఇండియా నుంచే ఉంటున్నారు. మీరుగనక భారత్‌కు వెళ్లి అక్కడి వీధుల్లో గమనిస్తే ఆదాయంలో చాలా తారతమ్యాలు ఉన్న వ్యక్తులు కోకొల్లలుగా కనిపిస్తారు. అయినా సరే మీరు అక్కడి వైవిధ్యాన్ని ఆస్వాదించగలరు’’ అని అన్నారు. 

వెల్లువెత్తిన విమర్శలు
భారత్‌ను ప్రయోగశాలగా పోల్చడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ‘‘ తమ ప్రయోగాత్మక ఔషధాలను ప్రయోగించడానికి భారత్‌ను ఒక ల్యాబ్‌లాగా వాడుకుంటున్నారు. అయినాసరే ఇలాంటి పెద్దమనుషులు మనల్ని గినీ పందుల్లా వాడుకునేందుకు మన ప్రభుత్వాలే అనుమ తిస్తున్నాయి. దిగ్భ్రాంతికరం. సిగ్గుపడాల్సిన విషయం’’ అని సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మా దేశం మీకొక ప్రయో గశాల అనుకుంటున్నారా?. అయితే దేశం విడిచి వెళ్లిపొండి’ అని ఒక నెటిజన్‌ వ్యాఖ్యా నించారు. ‘‘ బిల్‌గేట్స్‌ భారతీయ మీడియా మొదలు విపక్షం, అధికార పక్షం ద్వారా ప్రతి వ్యవస్థనూ తనకు అనుకూలంగా మార్చుకుందన్నారు. మనమెప్పుడు మేల్కొంటామో’’ అని ఇంకో నెటిజన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)