Breaking News

భారత్‌-చైనా వివాదాల పరిష్కారానికి నిపుణుల బృందం ఏర్పాటు

Published on Wed, 08/20/2025 - 07:21

న్యూఢిల్లీ: భారత్‌-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు త్వరలో ఫుల్‌స్టాప్‌ పడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల సంయుక్త భేటీ అనంతరం ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

భారత్‌-చైనాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మరో ముందడుగు పడింది. ఇరు దేశాలు సరిహద్దు సమస్య పరిష్కారం కోసం కలసి పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు డీలిమిటేషన్‌కు పరిష్కారాన్ని అన్వేషించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల సమావేశం అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

ఇరుదేశాలు వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను పునఃప్రారంభించాలని, కైలాస పర్వత యాత్ర, మానసరోవర్ యాత్రకు మరింత ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించాయని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే లిపులేఖ్ పాస్, షిప్కి లా , నాథు లా వాణిజ్య కేంద్రాల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చర్చల ద్వారా త్వరలో భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాలలో శాంతి కొనసాగేందుకు అడుగుపడనున్నదనే అభిప్రాయాన్ని ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి. భారత్‌-చైనా ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుకునేందుకు ఈ చర్చలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.

భారత్‌-చైనాల సరిహద్దు సమస్య పరిష్కారం కోసం న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం  కుదిరిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. భారత-చైనా సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దు డీలిమిటేషన్‌ను అన్వేషించేందుకు, సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం వర్కింగ్ మెకానిజం (డబ్ల్యూఎంసీసీ) కింద నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి  ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు అంగీకరించారని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తెలిపింది. కాగా టియాంజిన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ)శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడాన్ని చైనా  స్వాగతించింది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)