Breaking News

బైడెన్‌ వర్సెస్‌ ట్రంప్‌.. ‘బిగ్‌ డిబేట్‌’ వైపే అందరి చూపు

Published on Mon, 06/24/2024 - 21:40

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.  ప్రచారంలో భాగంగా  వారిద్దరి మధ్య జూన్‌ 27న తొలి పబ్లిక్‌ డిబేట్‌(చర్చ) జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు ఈ డిబేట్‌ జరగనుంది. 

డిబేట్‌లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వారిద్దరు చెప్పనున్నారు. డిబేట్‌లో బైడెన్‌,ట్రంప్‌ ఇద్దరు కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో బైడెన్‌, ట్రంప్‌ వయసు కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యంగా బైడెన్‌ ఇటీవల తన మతిమరుపును పదే పదే బయటపెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. 

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్‌ ట్రంప్ దూకుడు తట్టుకోగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది.  ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధనేతల మధ్య జరగనున్న డిబేట్‌ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అన్ని ఒపినీయన్‌ పోల్‌ సర్వేలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారనే చెబుతున్నాయి. ఈ డిబేట్‌ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరివైపు కొంత మేర షిఫ్ట్‌ అవ్వొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)